ఏటీపీ ర్యాంకింగ్స్: దిగజారిన సోమ్‌దేవ్!
తాజాగా విడుదల చేసిన ఏటీపీ ర్యాంకింగ్స్‌లో సోమ్‌దేవ్ టాప్ 100లో స్థానంకోల్పోయాడు. ఈ ర్యాంకింగ్స్‌లో సోమ్‌దేవ్ రెండు స్థానాలు దిగజారి 102వ స్థానంలో నిలిచాడు. అలాగే యుకీ భాంబ్రీ నాలుగు స్థానాలు కోల్పోయి 153వ ర్యాంక్‌కు పడిపోయాడు. డబుల్స్‌లో సాకేత్ ఏడు స్థానాలు ఎగబాకి 262వ ర్యాంక్‌కు చేరాడు. పేస్ 9వ ర్యాంక్ పదిలం చేసుకున్నాడు.