Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆతిథ్య జట్టు పరాజయంతో క్వార్టర్స్‌లో జర్మనీ

Advertiesment
ఆతిథ్య జట్టు పరాజయంతో క్వార్టర్స్‌లో జర్మనీ

Pavan Kumar

, మంగళవారం, 17 జూన్ 2008 (19:30 IST)
వియన్నాలో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్లలో ఒకటైన ఆస్ట్రియా 1-0 గోల్ తేడాతో జర్మనీ చేతిలో పరాజయం పాలై ఇంటిముఖం పట్టింది. జట్టు కెప్టెన్ బల్లాక్ చేసిన ఏకైక గోల్ సాయంతో జర్మనీ విజయోత్సాహంతో యూరో క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. ప్రపంచ కప్ 2006 సెమీస్‌లో జర్మనీ ఓటమి పాలై ఇంటిముఖం పట్టగా నేడు ఆ దేశ అభిమానులు ఈ విజయంతో పులకరించిపోతున్నారు. జర్మనీ 1986 తర్వాత యూరో కప్ తదుపరి దశలోకి ప్రవేశించింది.

గ్రూప్ బి నుంచి క్రొయేషియా, జర్మనీలు క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాయి. ఆతిథ్య జట్లలో ఒకటైన స్విస్ మాత్రం ఒక్క విజయంతో ఇంటిముఖం పట్టింది. స్విస్ గ్రూప్ ఎ నుంచి బరిలోకి దిగింది. గ్రూప్‌లో మేటి జట్టు పోర్చుగల్‌ను 2-0 గోల్స్ తేడాతో స్విస్ ఓడించింది. స్విస్ జట్టు మ్యాచ్ ఆరంభం నుంచి వ్యూహాత్మకంగా ఆడుతూ పోర్చుగల్ దాడులను తిప్పికొట్టింది. పోర్చుగల్ క్రీడాకారులు గోల్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. స్విస్ తరపున హకాన్ యాకిన్ (73 ని.), పెన్ (83 ని.)లు గోల్ చేశారు. టోర్నీలో ఆతిధ్య జట్టు పరువును యాకిన్ నిలబెట్టాడు.

గ్రూప్ సీలో ఆసక్తికర పోరు బుధవారం జరుగుతుంది. గ్రూప్‌లో వరుస విజయాలతో దూసుకువెళుతున్న నెదర్లాండ్స్ జట్టు రొమేనియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో హాలెండర్లు విజయం సాధిస్తే ప్రపంచ అగ్ర జట్లు ఇటలీ, ఫ్రాన్స్‌లలో ఒకరు ఫైనల్లోకి అడుగుపెడుతారు. మరో మ్యాచ్‌లో ఫ్రాన్స్-ఇటలీలు తాడోపేడో బుధవారం తేల్చుకోనున్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచ్‌ల నుంచి ఒక పాయింట్ మాత్రమే సాధించాయి.

Share this Story:

Follow Webdunia telugu