Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. నష్టాల బాటలో టాప్ 9 సంస్థలు.. రూ. 65 వేల కోట్లు లాస్..!

Advertiesment
top 9 sensex companies lose rs 65919 cr in market valuation
, ఆదివారం, 3 మే 2015 (13:13 IST)
గత వారం రోజులుగా స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. పెట్టుబడి సెంటిమెంట్ బలహీనంగా ఉండడంతో ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో స్టాక్ మార్కెట్ కాపిటలైజేషన్ పరంగా టాప్-10లోని ఉన్న తొమ్మిది సంస్థలు 65,919 కోట్లు నష్టపోయాయి. టాప్ 10లో ఉన్న ఒక్క ఐసీఐసీఐ బ్యాంకు తప్ప మిగిలిన అన్ని కంపెనీలూ గత వారం నష్టపోయాయి. ఈ వారంలో సెన్సెక్స్ 426 పాయింట్లు పడిపోయి 27,011 పాయింట్ల వద్ద కొనసాగిన సంగతి తెలిసిందే. సిగరెట్ల నుంచి హోటల్స్ వరకూ వివిధ విభాగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న ఐటీసీ అత్యధికంగా రూ. 19,958 కోట్ల మేరకు మార్కెట్ కాప్‌ను కోల్పోయింది. 
 
 
కోల్ ఇండియా రూ. 8,306 కోట్లు, ఓఎన్జీసీ రూ. 9,582 కోట్లు, టీసీఎస్ రూ. 5,925 కోట్లు, ఇన్ఫోసిస్ రూ. 6,184 కోట్లు, హెచ్ డీఎఫ్ సీ రూ. 4,361 కోట్లు, రిలయన్స్ రూ. 5,343 కోట్లు, ఎస్‌బీఐ రూ. 4,237 కోట్ల విలువను కోల్పోయాయి. అయితే ఇదే సమయంలో ఐసీఐసిఐ బ్యాంకు మార్కెట్ విలువ రూ. 13,464 కోట్ల రూపాయలు పెరిగి రూ. 1,92,077 కోట్లకు చేరుకోవడం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu