Publish Date: Wed, 05 Nov 2014 (18:27 IST)
Updated Date: Wed, 05 Nov 2014 (18:29 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ 55 పాయింట్ల మేరకు లాభపడి, 27,916 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 8,338 వద్ద స్థిరపడింది. విదేశీ నిధుల నిరంతర ప్రవాహం, రిటైల్ పెట్టుబడిదారుల స్థిరమైన కొనుగోళ్లు, ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలపై మరింత ఉత్సాహం, బ్లూ చిప్ కంపెనీలు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు ఆర్జించడం వంటి అంశాలు సూచీలను పైస్థాయికి తీసుకెళ్లినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
బుధవారం జరిగిన ట్రేడింగ్‌లో యాక్సిస్ బ్యాంక్, బీపీసీఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్‌సీఎల్‌టెక్, ఎస్‌బీఐ తదితర షేర్లు లాభాల బాటలో పయనించగా, కెయిర్న్ ఇండియా, జిందాల్ స్టీల్, సెసా స్టెరిలైట్, హిందాల్కో, ఎన్ఎండీసీ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.