Publish Date: Mon, 01 Sep 2014 (18:08 IST)
Updated Date: Mon, 01 Sep 2014 (18:08 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ భారీ లాభాలతో ముగిసింది. ఉదయం నుంచే జోరుమీద ఉన్న సెన్సెక్స్ సూచీ సోమవారం సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఏకంగా 229 పాయింట్లు లాభపడి 26,868 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 73 పాయింట్లు లాభపడి 8,028 వద్ద ముగిసింది. ఈ క్రమంలో నిఫ్టీ తొలిసారి ఎనిమిది వేల పాయింట్ల మార్కును దాటడం విశేషం.
కాగా, ఈ ట్రేడింగ్‌లో హీరో మోటో కార్ప్స మారుతి సుజుకీ, టాటా పవర్, హిండాల్కో, గెయిల్ తదితర కంపెనీల షేర్లు భారీ స్థాయిలో లాభపడ్డాయి. అటు సన్ ఫార్మా, ఐటీసీ లిమిటెడ్, హెచ్ డీఎఫ్ సీ, బెల్, టీటీ మోటార్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటన కూడా సోమవారం నాటి ట్రేడింగ్‌పై ప్రభావం చూపాయి.