బాంబే స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాల్లో కూరుకుపోయింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, కోవిడ్ కేసుల పెరుగుదల కారణంగా దేశీయ మార్కెట్ సూచీలు ఈ వారం నష్టాలతో ప్రారంభం అయ్యాయి.
ఇందులో భాగంగా సోమవారం ఉదయం బీఎస్ఈ 701 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ మార్క్ 56,495 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
అలాగే నిఫ్టీ 216 పాయింట్ల నష్టంతో 16,955 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఐసీఐసీఐ, మారుతీ షేర్లు లాభాల బాటలో కొనసాగుతుండగా, హెచ్‌యూఎల్, టెక్ మహీంద్రా, విప్రో, ఎల్అండ్‌టీ సంస్థలు నష్టాలను చవిచూశాయి.