Publish Date: Tue, 20 Jan 2015 (17:12 IST)
Updated Date: Tue, 20 Jan 2015 (17:13 IST)
భారత మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ దూసుకెళుతోంది. వడ్డీ రేట్లను తగ్గిస్తూ భారత రిజర్వు బ్యాంకు తీసుకున్న కీలక నిర్ణయంతో పాటు.. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై అంచనాలు తదితర కారణాలతో సెన్సెక్స్ బుల్ పరుగులు పెడుతోంది. దీంతో రికార్డు స్థాయిలో ట్రేడింగ్ జరుగుతోంది. ఇందులోభాగంగా సెన్సెక్స్ సూచీ మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 523 పాయింట్ల మేరకు లాభడి, 28785 పాయింట్ల వద్ద స్థిరపడింది. అలాగే, నిఫ్టీ కూడా 145 పాయింట్ల వృద్ధితో 8696 వద్ద ముగిసింది.
ఈ ట్రేడింగ్‌లో మెటల్, ఐటీ, బ్యాకింగ్ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు లాభాలను చవిచూశాయి. హెచ్‌డీఎఫ్‌సీస సెసా గోవా, టాటా స్టీల్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్ తదితర సంస్థల షేర్లు భారీ లాభాలు ఆర్జించగా, గెయిల్, టాటా పవర్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, మారుతీ సుజుకీ, హీరోమోటో కార్ప్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.
PNR
Publish Date: Tue, 20 Jan 2015 (17:12 IST)
Updated Date: Tue, 20 Jan 2015 (17:13 IST)