Publish Date: Mon, 09 Jun 2014 (17:18 IST)
Updated Date: Mon, 09 Jun 2014 (17:20 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 184 పాయింట్ల మేరకు వృద్ధి చెంది 25580 వద్ద స్థిరపడింది. అలాగే, నిఫ్టీ కూడా 71 పాయింట్ల మేరకు లాభపడి 7655 వద్ద ఆగింది. కోల్ ఇండియా, ఎల్ అండ్ వంటి బ్లూచిప్ కంపెనీలు దూకుడు ప్రదర్శించడంతో సెన్సెక్స్ సోమవారం కూడా లాభాల్లో ముగిసింది.
కాగా, ఈ ట్రేడింగ్‌లో యూనిటెక్, గ్రాసీం ఇండస్ట్రీస్, సన్ టీవీ, శోభా డెవలపర్స్, ఐఎఫ్‌సీఐ తదితర కంపెనీల షేర్లు లాభపడగా, పిపావావ్ డిఫెన్స్, గోద్రెజ్ కన్‌స్ట్రక్షన్స్, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, జుబిలెంట్ ఫుడ్, ఎంసీఎక్స్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.