Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్టోబర్‌.. ఆఖరివారం.. అవరోహణం.. ఒడిదుడుకుల్లో బంగారం ధరలు

Advertiesment
Sensex extends losses for fifth day
, శుక్రవారం, 30 అక్టోబరు 2015 (17:50 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఫలితంగా ఈనెల ఆఖరివారమంతా నష్టాల్లోనే ముగిశాయి. ఈ నెల చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం కూడా సెన్సెక్స్‌ సూచీ 181 పాయింట్ల మేరకు నష్టపోయి 26,656 వద్ధ స్థిరపడగా, నిఫ్టీ 45 పాయింట్లు కోల్పోయి 8,065 పాయింట్ల వద్ద ఆగింది. 
 
డాలరుతో రూపాయి మారకం విలువ రూ.65.30గా ఉంది. నేషనల్‌ స్టాక్‌‌ఎక్ఛ్సేంజీలో ఎన్టీపీసీ షేర్లు అత్యధికంగా 3.67శాతం లాభపడి రూ.132.65 వద్ద ముగిశాయి. దీనితోపాటుగా కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ, ఎస్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ సంస్థల షేర్లు సైతం లాభాలు గడించాయి. అలాగే ఐటీసీ సంస్థ షేర్లు అత్యధికంగా 4.47 శాతం నష్టపోయి రూ.334.35 వద్ద ముగిశాయి. వేదాంత, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బాష్‌ సంస్థల షేర్లు సైతం నష్టాలతో ముగిశాయి.
 
మరోవైపు బంగారం ధరల్లో కూడా వ్యత్యాసం కనిపించింది. ఫలితంగా శుక్రవారం రూ.27,000 దిగువకు చేరింది. రూ.245 తగ్గడంతో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.26,830కి చేరింది. నగల వ్యాపారులు కొనుగోళ్లు చేయకపోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దీని ధర తగ్గిందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. 
 
అలాగే, అంతర్జాతీయంగా న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,145.50 అమెరికన్‌ డాలర్లుగా ఉంది. రూ.37,000 దిగువకు వెండి ధర సైతం రూ.37,000 దిగువకు చేరుకుంది. రూ.735 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.36,630కి చేరింది. నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాలు కొనుగోళ్లు జరపకపోవడంతో దీని ధర తగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. 

Share this Story:

Follow Webdunia telugu