Publish Date: Wed, 12 Nov 2014 (17:55 IST)
Updated Date: Wed, 12 Nov 2014 (17:56 IST)
భారత్ మార్కెట్‌లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం జోరుగా ఉంది. దీంతో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్‌లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. ఒక దశలో బీఎస్ఈ సెన్సెక్స్ 28,051.78 పాయింట్ల స్థాయిని తాకింది. అలాగే, నిఫ్టీ సైతం 8,394.95 పాయింట్ల రికార్డుకు చేరింది. అయితే, ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ సూచీ.. 123 పాయింట్ల మేరకు లాభపడి 28033 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 25 పాయింట్ల మేరకు వృద్ధి చెంది 8388 వద్ద ఆగింది.
ఈ ట్రేడింగ్‌లో ఎస్.బి.ఐ, యాక్సెస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, గతి, ఉషా మార్టిన్ వంటి కంపెనీల షేర్లు లాభాలను అర్జించగా, తిలక్ ఫైనాన్స్, హెచ్ఎఫ్‌సీఎల్, ఆప్టో సర్క్యూట్స్, మాత్రా కుషాల్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.