Publish Date: Fri, 10 Oct 2014 (17:53 IST)
Updated Date: Fri, 10 Oct 2014 (17:55 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలతో ముగిసింది. ప్రధాన సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్ 340 పాయింట్ల నష్టంతో 26,297 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ వంద పాయింట్ల నష్టంతో 7,860 వద్ద స్థిరపడింది.
ప్రపంచ మార్కెట్లలో ప్రతికూల ప్రభావం, మెటల్, ఆటోమొబైల్, బ్యాంకింగ్ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టడంతో మార్కెట్లు నష్టాల పాలయ్యాయి.
కాగా, ఈ ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్, హీరో మోటార్ కార్ప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, బీహెచ్‌ఈఎల్, కంపెనీల షేర్లు లాభాలను స్వీకరించగా, టాటాపవర్, హిందాల్కో, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర షేర్లు భారీ నష్టాలు చవిచూశాయి.