Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెన్సెక్స్ స్పీడ్... 500 పాయింట్లకు పైగా లాభాల్లో...

Advertiesment
Normal Monsoon Forecast Sends Sensex To Over 3-Month High
, బుధవారం, 13 ఏప్రియల్ 2016 (15:20 IST)
భారతీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా ర్యాలీని కొనసాగిస్తున్నాయి. బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్‌.. మధ్యాహ్నం 3 గంటల వరకు అదే జోరు కొనసాగిస్తోంది. మధ్యాహ్నానికి సెన్సెక్స్‌ 500 పాయింట్లకుపైగా లాభపడి 25,650 మార్కు దాటగా.. నిఫ్టీ 150 పాయింట్లు పైగా లాభపడి 7860 వద్ద కొనసాగుతోంది. 
 
ఈ యేడాది వర్షపాతం సాధారణ స్థాయి కంటే మెరుగ్గా ఉంటుందన్న వాతావరణ శాఖ అంచానాలు వేసింది. దీంతో భారతీయ వృద్ధి రేటు బాగుంటుందన్న ఐఎంఎఫ్‌ నివేదికలు మధుపరుల్లో అంచనాలను పెంచాయి. మార్కెట్లోని అన్ని సెక్టార్లు లాభాల బాటపట్టడం సెంటిమెంట్‌ ఎంత బలంగా ఉందో తెలియజేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ఫలితాలు కూడా దేశీయ స్టాక్‌మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu