ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ లిమిటెడ్ కంపెనీ ఈనెల 4వ తేదీన పబ్లిక్ ఇష్యూను జారీ చేయనుంది. ఈ ఇష్యూకు లీడ్ మేనేజర్‌గా ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్ వ్యవహరిస్తుందన్నారు. దీన్ని బీఎస్ఈలో నమోదు చేసినట్టు తెలిపారు. ఈ ఇష్యూ ద్వారా ముఖ విలువ రూ.5000, రూ.25000 కలిగిన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్.సి.డి) ద్వారా మొత్తం వంద కోట్ల రూపాయలను సమీకరించాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పబ్లిక్ ఇష్యూలో అన్ని రకాల కేటగిరీల్లో కనీసం రూ.25000గా చొప్పున డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో నాలుగు ఆప్షన్లను ప్రకటించింది.
ఆప్షన్ 1లో 36 నెలల కాలపరిమితి కలిగిన డిపాజిట్లకు ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీని అందజేస్తారు. రెండో ఆప్షన్‌లో 66 నెలలు. ఇందులో డిపాజిట్ మెచ్యూరిటీ అయిన తర్వాత పూర్తి వడ్డీని చెల్లిస్తారు. మూడో ఆప్షన్ ప్రకారం డిపాజిట్ కాలపరిమితి 72 నెలల పాటు ఉంటుందని, ఇందులో నెలవారీగా వడ్డీలు చెస్తారు. ఆప్షన్ నాలుగులో 84 నెలల కాలపరిమితి కలిగివుంటుంది. అయితే, ఆప్షన్ 1లో 12.5 శాతం వడ్డీని అందజేస్తారు. ఆప్షన్ 3లో 12.65, 12.75 శాతం చొప్పున చెల్లిస్తారు. ఆప్షన్ 4లో రూ.13.1 శాతం చొప్పున వడ్డీని చెల్లిస్తారు.
ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించే మొత్తాన్ని ఈ సంస్థ పూణెలో చేపట్టిన డీఎస్‌కే డ్రీమ్ ప్రాజెక్టులో పెట్టుబడిగా పెట్టనున్నారు. ఈ ప్రాజెక్టును మొత్తం 217 ఎరకాల విస్తీర్ణంలో చేపట్టారు. మొత్తం 8 నుంచి 10 సంవత్సరాల్లో పూర్తి చేసే ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించి రెండు నెలలు అయిందని, తొలి దశ ప్రాజెక్టు పనులు వచ్చే 2017 డిసెంబర్ నాటికి పూర్తవుతాయని డీఎస్ కులకర్ణి డెవలపర్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్ హెచ్.డి. కులకర్ణి వెల్లడించారు.
ఈమెతో పాటు.. ఆసంస్థ సీఎఫ్ఓ నితీష్ దేష్‌పాండే, ప్రెసిడెంట్ శిరీష్ కులకర్ణి, చీఫ్ సెక్రటరీ అమూల్ పురందరేలు గురువారం చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ... డీకే కులకర్ణ డెవలపర్స్ ప్రాజెక్టు ప్రధానంగా పూణె, ముంబైలలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను చేపట్టినట్టు తెలిపారు. వీటి తర్వాత బెంగుళూరు, చెన్నై, యుఎస్‌లోని న్యూజెర్సీలో తమ ప్రాజెక్టులు పూర్తి చేసినట్టు వారు తెలిపారు. తమ సంస్థ కేవలం రియల్ ఎస్టేట్ రంగంలోనే కాకుండా, ఆటోమొబైల్, ఎడ్యుకేషన్ రంగాల్లో అగ్రగామిగా దూసుకెళ్తున్నట్టు తెలిపారు.