స్టాక్ మార్కెట్‌కు బ్లాక్ డే: 400 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
వచ్చే నెలలో ఉద్దీపన ప్యాకేజీలకు అమెరికా ప్రభుత్వం మంగళం పాడనుందనే భయాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో వీరు అమ్మకాల వైపు మొగ్గుచూపడం స్టాక్ మార్కెట్ భారీ పతనానికి దారితీసింది. తద్వారా గురువారం సెన్సెక్స్ ఏకంగా 400 పాయింట్లకు పైగా పతనమైంది. పవర్, రియాల్టీ, పీఎస్ యూ, సీజీ, బ్యాంకెక్స్ సూచీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 406 పాయింట్లు నష్టపోయి 20,229 పాయింట్ల మార్కు వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ కూడా 124 పాయింట్లు కోల్పోయి 5,999 దగ్గర క్లోజయింది.ఇకపోతే.. డాబర్ ఇండియా, వోక్ హార్డ్ ఫార్మా, అమరరాజా బ్యాటరీస్, శ్రీరామ్ సిటీ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్ వంటి కంపెనీలు లాభపడగా, ఫ్యూచర్ రీటెయిల్, పవర్ ఫైనాన్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా , రామ్ కో సిమెంట్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ వంటి సంస్థలు నష్టపోయాయి.