Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రశాంతతకు నిలయంగా గోవా బీచ్

Advertiesment
ప్రశాంతతకు నిలయంగా గోవా బీచ్
, మంగళవారం, 15 ఏప్రియల్ 2008 (17:13 IST)
మన దేశంలో సముద్ర తీరాలంటే మనకు బాగా గుర్తుకు వచ్చేది గోవా బీచే. అవును మరి చెప్పలేనంత అందాన్ని దాచుకుని మనను ఊరిస్తుంటాయి గోవా తీరాల అందాలు. అంతే కాకుండా వేసవిలో మనసుకు టానిక్‌లా శక్తినిస్తాయి ఈ తీరాలు. అలసిన మనసులు కాసేపు షికారు కొట్టేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి కదా మరి.

ఇక్కడ ఉన్న బీచ్‌లు అందానికే కాదు విదేశాల నుంచి వచ్చేవారికి చక్కని షాపింగ్ స్పాట్‌గా పేరు పొందాయి. అరేబియా సముద్ర అలల అల్లరులు, లయకు స్వరం తప్పకుండా నాట్యం చేసే తాటి చెట్లు... ఎవరికి మాత్రం ఇష్టం ఉండవు ? వాటితో కలసి తాము ఆడుకోవాలని మనసు ఉవ్విళ్లూరుతుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం పదండి మరి...

గోవాలో చూడవలసిన ముఖ్యమైన బీచ్‌లు అగాండ బీచ్, అంజునా బీచ్, క్యాలన్‌గుట్ బీచ్, కోల్వా బీచ్, డొనా పౌలా బీచ్... ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అగాండా బీచ్ : ఒంటరిగా ఉండాలనుకునే వారికి, కష్టాలను కాసేపు మరిచిపోయి ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి ఈ బీచ్ స్వర్గమనే చెప్పాలి.

అంజునా బీచ్ : గోవా రాజధాని పనాజీ నుంచి 18 కి.మీ దూరంలో ఉంది అంజునా బీచ్. ఇక్కడ జరిగే పార్టీలు, షికార్లు, ఉల్లాస కబుర్లు చాలా ఆనందంగా ఉంటాయి. వివిధ రకాల కార్యకలాపాలు జరిగే ఈ బీచ్ పర్యాటకులను ఏడాది పొడవునా ఆకర్షిస్తుంది.

అరంబల్ బీచ్ : పనాజీ నుంచి 50 కి.మీ దూరంలో ఉన్న ఈ బీచ్ గజిబిజి జీవితాలకు చాలా దూరంగా ఉన్నట్టుంటుంది. ప్రశాంతత కోసం అల్లాడిపోయేవారు ఇక్కడకు వచ్చి సేదతీరుతుంటారు. అంతే కాకుండా చుట్టూ ఉండే ప్రకృతి అందం మైమరిపింప చేస్తుంది. ఇక్కడ ఉన్న బీచ్‌లకు వేర్వేరు పేర్లు పెట్టినా, వాటిలో దొరికే ప్రశాంతత మాత్రం ఒక్కటే.



Share this Story:

Follow Webdunia telugu