Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రకృతి ప్రేమికుల స్వర్గ సామ్రాజ్యం "అండమాన్"

Advertiesment
పర్యాటక రంగం సముద్ర తీరాలు ద్వీపం అండమాన్ స్కూబా డైవింగ్ బీచ్ రాధానగర్ బీచ్ హర్మిందర్ బే బీచ్ కర్మటాంగ్
నీలి సముద్రపు నీరు, తెల్లటి ఇసుక తీరాలు, ద్వీపాలకు సమీపంలోని పగడపు దీవులతో... ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేసే స్వర్గమే "అండమాన్". మన విశాల భారత దేశంలో భాగమే అయినా, బంగాళాఖాతంలో ఓ మూలకు విసిరేసినట్లుగా ఉండే ద్వీపాలే అండమాన్ ద్వీపాలు.

ఈ అండమాన్‌లో పర్యాటకులకు పలురకాల క్రీడా సౌకర్యాలుండగా, అవన్నీ నీటిమీద ఆడే ఆటలే కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. మానవ సంచారం ఏ మాత్రం లేని ద్వీపాలు కొన్ని ఈ అండమాన్‌లో ఉన్నప్పటికీ.. అలాంటి ద్వీపాలమీద ఒంటరిగా గడిపే అవకాశాన్ని పర్యాటకులకు ప్రత్యేకంగా కల్పిస్తారు.

నీళ్ళలోకి మునిగి వెళ్ళేందుకు అవసరమైన పరికరాలను అక్కడి పర్యాటక శాఖ సమకూరుస్తుంది. "స్కూబా డైవింగ్" అనే ఈ పద్ధతిలో నీటిలోపలి చేపలతోపాటు మనం కూడా ఈదుతూ... సముద్రపు లోపలి అందాలను కూడా తనివితీరా చూడవచ్చు. పర్యాటకులకు ఇంతకుమించిన సంతోషం ఏముంటుంది చెప్పండి.

ఇకపోతే.. అండమాన్ వెళ్ళినవారు తప్పకుండా చూడాల్సిన బీచ్‌లు ముఖ్యంగా మూడు. అవేంటంటే... ఒకటి రాధానగర్ బీచ్, రెండవది హర్మిందర్ బే బీచ్, మూడవది కర్మటాంగ్ బీచ్. అలాగే, ప్రకృతిలోని జీవుల వైవిధ్యానికి నిలయమైన ఈ అండమాన్‌లోని ఫిషరీస్ మ్యూజియం రకరకాల చేపలను మన కళ్లముందు నిలుపుతుంది.

అంతేగాకుండా, ప్రపంచంలోని విశేషమైన సీతాకోక చిలుకలను కూడా ఇక్కడ చూడవచ్చు. హారెట్ నేషనల్ పార్క్‌లో ఈ సీతాకోక చిలుకలు వందలు, వేలుగా కొలువుదీరి కనువిందు చేస్తుంటాయి.

స్వాంతంత్ర్య వీరుల జీవితాలతో ముడిపడిన ఈ అండమాన్ దీవుల్లో వీర సావర్కార్ లాంటి వీరుడు కఠిన కారాగార శిక్ష అనుభవించిన సెల్యులార్ జైల్ ఇక్కడే ఉంది. స్వతంత్ర భారతంలో ఈ జైలుని ఒక మ్యూజియంలాగా మలచారు.

చివరగా.. అద్భుతమైన వర్ణించ వీలులేని అందాలను తనలో పొదివిపర్చుకున్న అండమాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. అయితే... ప్రకృతి శోభ, దేశ చరిత్రలమీద శ్రద్ధాసక్తులు కలిగిన యువ జంటలుగానీ, ఎవరయినా సరే తప్పక చూడదగిన భూతల స్వర్గం మన అండమాన్ దీవులు.

Share this Story:

Follow Webdunia telugu