స్వచ్ఛమైన నీళ్ళు, చల్లటి గాలి, ఊరించే అందాల దృశ్యాలు, ఆనందాలు... ఇలా వీటన్నింటి కలబోతే మెక్సికోలోని "కాన్‌కూన్ ఐలాండ్". ఈ దీవిలో విరిసిన అందాలను చూడాలంటే మన రెండుకళ్ళూ సరిపోవు. ఇక్కడి సకలవర్ణ చేపలు మనకు షేక్‌హ్యాండ్ ఇస్తూ హాయిగా స్వాగతం చెబుతాయి. కాన్‌కూన్ దీవిలో చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కాన్‌కూన్ బీచ్‌కి దగ్గర్లోగల "షిజెనిట్జా" అనే ప్రాంతం. క్రీ.శ. 490వ సంవత్సరంలో కట్టబడిన ఈ కట్టడం ప్రపంచంలోనే గొప్ప ఆర్కలాజికల్ వండర్‌గా గుర్తించారు. ఎవరైనా సరే తప్పకుండా చూసి తరించాల్సిన చారిత్రాత్మక ప్రదేశం ఇది. ఇక్కడి మ్యూజియం అందమైన శిల్పాలకు, హస్తకళలకు నిలయంగా విలసిల్లుతోంది. |
"కాన్‌కూన్"లో డాల్ఫిన్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇక్కడ అండర్ వాటర్ వాకింగ్ కూడా చేయవచ్చు. సీ లెవల్ నుంచి 30 అడుగుల కింద నీళ్లలో లక్షలాది చేపలు, రకరకాల సముద్ర జీవులను చూస్తూ, వాటి మధ్య నడుస్తుంటే మనం కూడా ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుంది అనిపించక మానదు |
|
|
పురాతన కాలపు "మాయన్ సివిలైజేషన్" చెందిన చరిత్ర ప్రసిద్ధమైన "షిజెనిట్జా" గురించి ఎంత చెప్పినా మాటలు సరిపోవు. పర్యాటకులందరూ తప్పనిసరిగా చూడాల్సిన అద్భుతమైన కట్టడం ఇది. ఇక్కడ చప్పట్లు కొట్టినప్పుడల్లా పక్షులు కిలకిలరావాలతో తమ ఉనికిని చాటుకుంటూ పైకెగిరే దృశ్యం చూడముచ్చటగా ఉంటుంది.
తరువాత అక్కడికి దగ్గర్లో గల "షెల్ హ" నేషనల్ పార్క్ కూడా చూడదగ్గదే. ఇదో నేచురల్ ఎన్విరాన్మెంట్ పార్క్. ఇక్కడి ఆక్వేరియంలో ఎన్నోరకాల రంగు రంగుల చేపలను చూడవచ్చు. అసలు అక్కడ గల రంగు రంగుల చేపలను చూస్తే, నిజంగా చేపలు ఇన్నిరంగుల్లో కూడా ఉంటాయా..? అనిపించక మానదు.
ఆ తరువాత చెప్పుకోదగ్గది "హలో డాల్ఫిన్". ఇక్కడ జరిగే డాల్ఫిన్ షోలు చాలా ఫేమస్. హాయిగా ఐస్‌క్రీములు తింటూ, ఫ్రెండ్స్‌తో డాల్ఫిన్ షోలను బాగా ఎంజాయ్ చేయవచ్చు. దాని తరువాత మెక్సికోలోనే అతి పెద్దదయిన "కోజుమెల్ ఐలాండ్" అనే ప్రాంతం చూడదగ్గది.
కోజుమెల్ ఐలాండ్‌ను స్క్యూబా డైవింగ్, స్నార్కెలింగ్ లాంటి వాటర్ స్పోర్ట్స్‌కి "స్వర్గధామం" అని పిలుస్తుంటారు. ఈ ఐలాండ్‌లో షార్క్ చేపలను చూడవచ్చు. ఇక్కడ చేసే స్క్యూబా డైవింగ్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ డైవింగ్‌లో గేర్ వేసుకుని స్నార్న్కెలింగ్ చేయడం కూడా చాలా ఎక్జైటింగ్‌గా అనిపిస్తుంది.
ఇదే కోజుమెల్ ఐలాండ్‌లో "ఎక్స్‌క్యారెట్" అనే ఇకలాజికల్ థీమ్ పార్క్ ఉంటుంది. ఇక్కడ వందలకొద్దీ సీతాకోక చిలుకలను చూస్తుంటే ప్రపంచంలోని అందమైన రంగులన్నీ కళ్లముందు కదలాడినట్లుగా ఉంటుంది. ఈ పార్కులోని పువ్వుల చెట్లు, పక్షులు ప్రకృతి అందానికి సజీవ తార్కాణాలుగా కనిపిస్తాయి. ఈ పార్కులో డాల్ఫిన్లతో ఆటలాడుతూ స్విమ్మింగ్ చేయడం అనేది ఓ మరపురాని అనుభూతిగా మిగిలిపోతుంది.
"కాన్‌కూన్"లో డాల్ఫిన్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇక్కడ అండర్ వాటర్ వాకింగ్ కూడా చేయవచ్చు. సీ లెవల్ నుంచి 30 అడుగుల కింద నీళ్లలో లక్షలాది చేపలు, రకరకాల సముద్ర జీవులను చూస్తూ, వాటి మధ్య నడుస్తుంటే మనం కూడా ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుంది అనిపించక మానదు.
ఈ దీవిలో చేపలు కూడా పట్టవచ్చు. ఫ్లై ఫిషింగ్, స్పోర్ట్ ఫిషింగ్, డీపీ సీ ఫిషింగ్, అనే పేర్లతో ఇక్కడ చేపలు పడుతుంటారు. కాన్‌కూన్‌లో తప్పకుండా ప్రయత్నించి చూడాల్సింది మాత్రం ఒకటుందండోయ్.. అదే బోట్ సెయిలింగ్. ఎటుచూసినా స్వచ్ఛమైన నీళ్లు, చల్లటిగాలితో... ఎన్నిసార్లు చూసినా తనివితీరని అద్భుతమైన అనుభవాల సమ్మేళనం "కాన్‌కూన్ ఐలాండ్" సందర్శనం.
సంవత్సరం పొడవునా ఏ కాలంలోనయినా సరే పర్యాటకులు సందర్శించేందుకు వీలైన ప్రదేశం కాన్‌కూన్. ఏ కాలంలో వెళ్ళినా ఫర్వాలేదుగానీ, చలికాలంలో అయితే సూపర్‌గా ఉంటుంది. మెక్సికోలో చలికాలం డిసెంబర్ నుంచి ఏఫ్రిల్ నెల వరకు ఉంటుంది, పైగా మన భారతదేశ వాతావరణానికి ఏ మాత్రం భిన్నంగా ఉండదు. సో... వీలయితే కాన్‌కూన్‌లో వాలిపోతారు కదూ...?!