Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పర్యాటకుల ఆకర్షణకు ఆసీస్ ప్రత్యేక చర్యలు: బేరీ

Advertiesment
పర్యాటకుల ఆకర్షణకు ఆసీస్ ప్రత్యేక చర్యలు: బేరీ
WD PhotoWD
ప్రపంచ ఆర్థిక రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా పర్యాటక రంగం నానాటికీ అభివృద్ధి చెందుతోంది. అన్ని ప్రపంచ దేశాలు విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు విన్నూత్న ప్యాకేజీలను ప్రవేశపెడుతున్నాయి. ఈ ప్యాకేజీలతో విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించేందుకు పలు రకాల కొత్త విధానాలను అనుసరిస్తున్నాయి. ఇందులో భాగంగా భారతీయ పర్యాటకులను ఆకర్షించే దిశగా ఆస్ట్రేలియా పర్యాటక విభాగం మనదేశంలో ప్రత్యేక చర్యలు చేపట్టింది.

ఈ పర్యటనలో భాగంగా మనదేశానికి చెందిన 100 మంది ట్రావెల్ ఏజెంట్లకు ఆస్ట్రేలియా పర్యాటక రంగంపై అవగాహన శిబిరం నిర్వహిస్తామని దేశ పర్యాటక విభాగం (ఈస్ట్) ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ రిచర్డ్ బీరీ తెలిపారు. పర్యటన వలన వ్యక్తుల మధ్య, ప్రాంతాల మధ్య, దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టమవుతాయని బేరీ అన్నారు. గత ఏడాది ఆస్ట్రేలియాలో 5.1 మిలియన్ విదేశీ పర్యాటకలు సందర్శించారని చెప్పారు.

ముఖ్యంగా ఆసియా దేశాల నుంచి తమదేశానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారని వెల్లడించారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా టూరిజం శాఖ తూర్పు ఆసియా విభాగం జనరల్ మేనేజర్ మాగీ వైట్, భారతదేశ మేనేజర్ అభిలాషా జైన్, టూరిజం ఆస్ట్రేలియా అధికారులు నీల్ గార్డెన్ ట్రైనీలు ప్రసంగించారు. ప్రస్తుతం మారుతున్న అభిరుచులకు అనుగుణంగా పర్యాటక రంగం కూడా పలు పథకాలను ప్రవేశపెట్టిందని వారు తెలిపారు.

గత సంవత్సరం నుండి ఆస్ట్రేలియాను 90వేల మంది సందర్శించారు. ఈ సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 26 శాతం వృద్ధి సాధిస్తుందని ఆశిస్తున్నట్లు వారు వెల్లడించారు. అలాగే భారతదేశ పర్యాటకులను ఆస్ట్రేలియా అమితంగా ఆకట్టుకుంటుందన్నారు. ఆస్ట్రేలియాను సందర్శించే పర్యాటకులకు వెసులుబాటు కల్పించే లక్ష్యంతో 2003లో "టూరిజం ఆస్ట్రేలియా ఇండియా ట్రావెల్ మిషన్" (ఐటీఎం)ను ఏర్పాటు చేశామని చెప్పారు.

ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది భారతదేశంలో ప్రత్యేక ప్రదర్శనలు నిర్వస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇందులో భాగంగా ఈ ఏడాది చెన్నైలో కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యాటక స్థలాలతో పాటు మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం, బిల్లీ స్టీమ్ రైల్వేస్టేషన్, స్టాంఫర్డ్ హోటల్స్ వంటి అనేక సందర్శన ప్రాంతాలకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయని రిచర్డ్ బీరి వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu