Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అహ్లాదాన్ని అందించే సముద్రతీర ప్రాంతాలు

అహ్లాదాన్ని అందించే సముద్రతీర ప్రాంతాలు
, బుధవారం, 7 సెప్టెంబరు 2011 (19:00 IST)
7,600 కి.మీల సుదీర్ఘ సముద్రతీరం ఉన్న భారత్‌లో మనస్సుకు అహ్లాదం కలిగించే అనేక బీచ్‌లు ఉన్నాయి. కొన్ని బాగా ప్రాచుర్యం పొందితే అనేకం చాలామందికి తెలియకుండా పోయాయి. ప్రాచుర్యం పొందిన చెన్నైలోని మెరీనా, గోవాలోని కలంగుతే, బాగా బీచ్‌ల నుంచి పక్కకు వెళ్లే ప్రయత్నం చేద్దాం. పర్యటించగల మరికొన్ని బీచ్‌లను చూద్దాం...

పేరు : విశాఖపట్నం బీచ్
ఎక్కడుంది : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ప్రత్యేకత : ఇది చాలా సురక్షితమైన బీచ్ ఇక్కడి గాలికి వళ్ళు పులకించి పోతుంది. విశాఖపట్టణానికి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ బీచ్ ఉంది. ఈ బీచ్ ఈత, జల క్రీడలకు అనువైనది.

పేరు : భీమునిపట్నం బీచ్
ఎక్కడుంది : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ప్రత్యేకత : ఇది చాలా దూరం కనిపిస్తుంది. ఇక్కడకు దేశ విదేశాల నుంచి జనం వస్తుంటారు.

పేరు : జూహూ బీచ్
ఎక్కడుంది : ముంబయి
ప్రత్యేకత : అరేబియా మహా సముద్రంలోని ఇక్కడి సుందర దృశ్యాలు నుంచి కనిపిస్తాయి.

పేరు : చౌపతి బీచ్
ఎక్కడుంది : ముంబయి, మహరాష్ట్ర
ప్రత్యేకత : స్నాక్ బార్ బీచ్గా పేరు పోయింది. సాయంత్రాలు మారిన్ డ్రైవ్‌లు చాలా ఆనందదాయకంగా కనిపిస్తాయి.

పేరు : గోపాల్ పూర్ బీచ్
ఎక్కడుంది : ఒరిస్సా
ప్రత్యేకత : ఇక్కడున్న బీచ్‌ రీసార్ట్ చాలా సుందరమైనది. విశ్రాంతి, ఉత్సాహం, ఉల్లాసం కోరుకునే వారికి ఇది ఎంతగానో ఊరటనిస్తుంది.

పేరు : చండీపూర్ బీచ్
ఎక్కడుంది : ఒరిస్సా
ప్రత్యేకత : ఇక్కడున్న నీటిలోతులు సుందరంగా కనిపిస్తాయి. ఇవే ఇక్కడ సుందర వాతావరణానికి కారణం. పిల్లలకైనా, పెద్దలకైనా ఇది సరిగ్గా సరిపోయే బీచ్‌గా చెప్పవచ్చు.

పేరు : పూరీ బీచ్
ఎక్కడుంది : ఒరిస్సా
ప్రత్యేకత : పూరీ జగన్నాథ దేవాలయ దర్శనం తరువాత చాలా మంది ఇక్కడికే వస్తుంటారు. ఇక్కడికి వచ్చి పోయినవారు మంచి అనుభూతిగా ఫీలవుతుంటారు.

పేరు :కోనార్క్ బీచ్
ఎక్కడుంది : ఒరిస్సా
ప్రత్యేకత : ఇక్కడున్న ప్రధాన ఆకర్షణ సూర్య దేవాలయమే. అయితే ఈ బీచ్ నుంచి కనిపించే సూర్యాస్తమయం దృశ్యం మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది.

పేరు :కోవలం బీచ్
ఎక్కడుంది : కేరళ
ప్రత్యేకత : ఈతకొట్టడానికి చిన్న పిల్లలకు మంచి వాతావరణం కనిపిస్తుంది. ఇది చాలా సుందర ప్రదేశం జీవితాంతం మనసులో చెరగని ముద్రవేస్తుంది.

పేరు: గోకర్ణ
ఎక్కడుంది: ఉత్తర కర్ణాటక
ప్రత్యేకత: గోకర్ణ ప్రాంతంలో నాలుగు బీచ్‌లు ఉన్నాయి-ఓమ్ బీచ్, హాల్ఫ్‌మూన్, కుడ్లే లేదా ప్యారడైజ్. ఈ బీచ్‌లు కొబ్బరి తోటలతో కప్పబడివున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu