Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ ఆలయం నుంచి సముద్రపు అలల ఘోష వినిపిస్తుంది.. ఎక్కడో చూస్తారా?

పర్యాటక ప్రాంతాలలో ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో విహార యాత్రలు చేసేవారు అందుకు అనువైన ప్రాంతాలకు వెళ్లాలనుకుంటారు. అలాంటి ప్రాంతాలలో కన్యాకుమారి ఒకటి. ఉత్తరాన ఉన్న హిమాలయాలు మంచుతో మంత్రముగ్ధుల్ని చేస్తే దక్షిణాన కన

ఆ ఆలయం నుంచి సముద్రపు అలల ఘోష వినిపిస్తుంది.. ఎక్కడో చూస్తారా?
, శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (14:54 IST)
పర్యాటక ప్రాంతాలలో ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో విహార యాత్రలు చేసేవారు అందుకు అనువైన ప్రాంతాలకు వెళ్లాలనుకుంటారు. అలాంటి ప్రాంతాలలో కన్యాకుమారి ఒకటి. ఉత్తరాన ఉన్న హిమాలయాలు మంచుతో మంత్రముగ్ధుల్ని చేస్తే దక్షిణాన కన్యాకుమారి సముద్రపు అందాలతో పర్యాటకులను కట్టిపడేస్తుంది.
 
ఇక్కడ ఎంతో పవిత్రమైన దేవాలయాలు, సముద్రతీరం ప్రసిద్ధి చెందిన కట్టడాలు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటాయి. వీటి అందాన్ని చూసి తరించవల్సిందే... ముఖ్యంగా... కుమారి అమ్మన్ టెంపుల్.
 
1. కన్యాకుమారిలో ఉన్న ప్రధాన ఆలయం ఇది. పట్టణం పేరును సార్ధకం చేస్తున్న ఆలయం. కన్యకు అంకితం చేసిన ఈ ఆలయాన్ని  అందంగా అలంకరిస్తారు. ఈ ఆలయంలో కుమారిని దేవతగా కొలుస్తారు. రోజూ ఈ ఆలయాన్ని కొన్ని వందల మంది సందర్శిస్తుంటారు. పర్యాటకులు ఎక్కువమంది సందర్శించడానికి మరొక కారణం ఈ ఆలయంలో నుంచి సముద్రపు అలల ఘోష వినిపించడమే..
 
2. గాంధీ మెమోరియల్ వద్ద సూర్యాస్తమయ అందాలు...
సూర్యాస్తమయ అందాలను చూడాలంటే గాంధీ మెమోరియల్‌కు వెళ్లవల్సిందే. ఇక్కడి వాస్తుకళ పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. మహాత్మా గాంధీ అస్తికలను సముద్రంలో కలిపే ముందు ఇక్కడ పెట్టారు. కనుక ఈ ప్రదేశానికి చాలా ప్రాధాన్యం ఉంది.
 
3. ఇక్కడ బీచ్‌లు చాలా ఉన్నా కన్యాకుమారి బీచ్ అందాలు బాగా ఆకట్టుకుంటాయి. బంగారువర్ణంలో మెరుస్తూ ఉండే మెత్తటి ఇసుక పర్యాటకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఆకాశం రకరకాల వర్ణాల్లో కనువిందు చేస్తుంది.
 
4. ఇక్కడ ఉన్న వివేకనందాపురంలో యోగా నేర్చుకోవాలనుకునేవారు ఆశ్రమంలో  కొన్నిరోజులు బస చేయవచ్చు. ఇక్కడ ఉన్న వివేకనందుడి ఫోటో ఎగ్జిబిషన్ ఎంతో బాగుంటుంది. ఈ ప్రదేశం ప్రజలలో మంచి చైతన్యాన్ని కలిగిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్‌పై కుట్రకు సంబంధించి.. నాకు చాలా నిజాలు తెలుసు: మాధవీలత