Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్యంత ఖరీదైన విహారయాత్ర

Advertiesment
అత్యంత ఖరీదైన విహారయాత్ర
విహారయాత్రకు మిలియన్ డాలర్ ఖర్చంటే నమ్ముతారా? సాధారణంగా అయితే ఖచ్చితంగా నమ్మం. మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాలంటే ఎంత మందికి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే ఇంత ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యే శ్రీమంతులు కూడా ఉన్నారు. లేకపోతే హోటళ్ళు ఆ ప్యాకేజీలకు ఎందుకు సిద్ధమవుతాయి చెప్పండి. సరిగ్గా ఇలాంటి ప్యాకేజీతోనే అబుదాబీలోని ప్యాకేజీని ప్రవేశ పెడుతోంది.

అరబ్ ఎమిరేట్స్‌లోని ఓ హోటల్ ప్రవేశ పెట్టి గిన్నీస్ బుక్‌లో ప్రవేశానికి తెగ ఆరాట పడుతోంది. అబుదాబీలోని ఎమిరేట్స్‌ ప్యాలెస్ ఈ ఆఫర్‌ ఇస్తోంది. ఒక్క మిలియన్ డాలరు ప్యాకేజీని ప్రకటించింది. ఇద్దరు అతిథుల కోసం ఏడు రాత్రులు గడపడానికి కనీసం 680 చదరపు మీటర్ల వైశాల్యం కలిగిన సూట్‌ను కేటాయిస్రారు.

అత్యంత విలాసవంతమైన జీవనం కోసం ప్యాలెస్ ఈ ప్యాకేజీని ప్రకటించింది. ఇతిహాడ్ ఎయిర్‌వేస్ రవాణా సౌకర్యాలను కల్పిస్తుంది. ఖనిజల ట్రీట్‌మెంట్ ఖరీదైన సేవలు ఉంటాయి. ఈ ప్యాకేజీని సెలబ్రెటీస్, సంపన్నులు, ప్రముఖ వ్యాపారవేత్తల కోసం ప్రవేశపెట్టే ఆ ప్యాకేజీనే ప్రపంచదేశాలలో ఖరీదైనది అవుతుంది. ఇందుకోసం దాదాపు 3 బిలియన్ డాలర్ల ఖర్చతో హోటల్‌ను నిర్మించారు. 302 గదులు, 92 సూట్‌లు ఇందులో ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu