వార్త: బీజేపీతో కలిసి మన్మోహన్ సింగ్ సర్కారుకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు ఇష్టం లేకనే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలనే పార్టీ డిమాండ్‌ను తిరస్కరిస్తున్నట్టు సోమ్‌నాథ్ ఛటర్జీ పేర్కొన్నారట.
చెవాకు:
అంతేనంటారా... మరేదైనా ఉందా. పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాన్ని అగ్రనేతల్లో ఒకరుగా ఉండి నిరాకరించడమేంటి. బీజేపీతో సీపీఎం కలిసే ప్రస్తావన ఎక్కడిది? యూపీఏకు లెఫ్ట్ మద్దతు ఇచ్చినందునేగా మీరు స్పీకర్ పదవికి వెళ్లారు. ప్రస్తుతం మీ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నందున మీరు కూడా ఆ పదవి నుంచి వైదొలగడమే న్యాయం కదా. పార్టీ నిర్ణయాన్ని మీలాంటి వారే ధిక్కరిస్తే ఇక సాధారణ కార్యకర్తలకు మార్గదర్శకం చేసే వారెవరు. లోక్‌సభ స్పీకర్ వంటి ఉన్నత గౌరవనీయ పదవిని వదులుకునేందుకు అంత తేలిగ్గా ఎవ్వరూ ఇష్టపడరనుకోండి.