Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వలసలకు బ్రేక్ కోసమేనా?

Advertiesment
హాస్యం చెవాకులు వార్త చెవాకు టీడీపీ పార్లమెంటు శాసనసభ ఎన్నికలు పోటీ అభ్యర్థులు పది రోజులు చంద్రబాబునాయుడు
, మంగళవారం, 9 సెప్టెంబరు 2008 (17:31 IST)
FileFILE
వార్త: టీడీపీ తరపున వచ్చే ఏడాది జరిగే పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మరో పది రోజులకల్లా సిద్ధం చేయాలని పార్టీ పార్లమెంటరీ ఇన్‌ఛార్జీలను టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

చెవాకు: అలాగైనా ఎక్కడకు వెళ్లకుండా మీ నేతలను నిలుపుకుంటే మంచిదే. ఎలాగూ ప్రతి నియోజకవర్గానికి కనీసం మూడు పేర్లు ఇమ్మని చెప్పారు కాబట్టి ఆ నియోజకవర్గంలోని ముగ్గురు ముఖ్యమైన నేతలను మీ పార్టీలోనే నిలుపుకోగలరు.

కానీ ఇలా ఎంతకాలం నిలుపుకోగలరు. వెళ్లాలనుకుంటున్న వారిని అడ్డుకోవడం మీ తరం కాదనే విషయం ఇప్పటికే గౌడ్, తమ్మినేని, ఆదికేశవులు నాయుడు, భూమాల విషయంలో నిరూపితమైంది.

ముందుగా పేర్లు ప్రతిపాదించడం ద్వారా వారిని బుజ్జగించినా, చివరకు టికెట్టు దక్కలేదంటే మాత్రం నేతలంతా కలసి కట్టుగా పార్టీ విజయం కోసం పనిచేస్తారనే మాట వట్టిదే. మరి బాగా ఆలోచించుకోండి.

Share this Story:

Follow Webdunia telugu