వార్తః నేను అవలంబించిన విధానాలు దేశానికే ఆదర్శం. వాటిని అందరూ అనుసరించాల్సిందేనన్న విషయాన్ని గ్రహించినందునే పలు రాష్ట్రాలు ఇప్పటికే దానిని అమలు చేశారు. నేను ప్రవేశపెట్టిన సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞానంపై చొరవ తీసుకున్నందునే సంపద పెరిగింది అని టీడీపీ చీఫ్ చంద్రబాబు నర్సారావుపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పుకున్నారు.
చెవాకుః ఆ విధానాలను ప్రజలు అంగీకరించి ఉంటే నేడు వైఎస్ అధికారంలో ఉండగలరా? మీకోసం యాత్రను మీరు చేపట్టే పరిస్థితి వచ్చేదా? పెన్షన్ల పెంపు, నిరుద్యోగ భృతి, రైతులకు పావలా వడ్డీలు ఇంతెందుకు... గ్యాస్ కూడా ఉచితమే అంటూ ఆ యాత్రలో రోజుకో వరం ప్రకటించాల్సిన అవసరం ఉండేదా? మన్మోహన్ సింగ్ అంతటోడే సంస్కరణల బాటతో పాటు పేదల సంక్షేమం కూడా చూడకుంటే మనుగడ లేదని తెలుసుకున్న తరుణంలో ఇక మీ విధానాలను ఎవరు పట్టించుకుంటారో మీరే చెప్పాలి.