Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పీఠం కోసం ఆ మాత్రమైనా శ్రమించొద్దా మరి

Advertiesment
పీఠం మాత్రం శ్రమ మరి
వార్తః మీకోసం యాత్రలో భాగంగా తెలంగాణా జిల్లాల్లో పర్యటిస్తున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుకు వడదెబ్బ తగిలినా యాత్ర యథావిధిగా సాగుతుందని పార్టీ వర్గాలు ప్రకటించాయి.


చెవాకుః అసలే గడ్డుకాలం. ఎన్టీఆర్ కలల పథకమైన రెండు రూపాయల బియ్యం పథకం క్రెడిట్ నేమో కాంగ్రెస్ ఎగరేసుకుపోతోంది. తెలంగాణాపై ఏం చేయాలో తెలియన్ స్థితిలో అక్కడ క్రెడిట్‌ను కొట్టేయాలని తెరాస దూసుకుపోతోంది. మధ్యలో మెగాస్టార్ భయపెడుతుంటే ఏం చేయాలి. ఇప్పటికీ హైటెక్ బాబుగానే మిమ్మల్ని చూస్తున్న ప్రజలను నమ్మించేందుకు ఈ మాత్రమైనా శ్రమించాలిగా. లేకుంటే జనం మిమ్మల్ని పూర్తిగా మరచిపోరూ. అలాగే ప్రచారం చేయకుంటే ఏడాది తర్వాత జరిగే ఎన్నికల్లో మీరు చెబుతున్నట్టు వైఎస్ సర్కారుకు వారెలా బుద్ధి చెప్పగలరు. ఇంతకీ ఎండ తీవ్రత తెలిసేగా ఈ యాత్ర చేపట్టింది. కాబట్టి ఇది మీకో లెక్కా. మళ్లీ పీఠం ఎక్కేస్తే ఆరోగ్యం తనంతట తానుగా కుదుటపడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu