Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తస్మాత్ జాగ్రత్త..!

Advertiesment
హాస్యం చెవాకులు నెల్లూరు కార్పొరేషన్ మేయర్ శైలజా రెడ్డి కాంగ్రెస్ ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి
, బుధవారం, 10 సెప్టెంబరు 2008 (17:08 IST)
WD PhotoWD
వార్త : నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కుంటున్న నెల్లూరు మేయర్ శైలజా రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయగా, త్వరలోనే చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

చెవాకు : అయ్యా మెగాస్టార్ గారూ, వలసలతోనే మీ పార్టీలోకి అనుభవజ్ఞులు చేరగలరని మీరనుకోవడంలో తప్పేమీ లేదు. కానీ ఈ వలసల పర్వం తప్పుదారి పట్టకుండా చూడండి.

ఇతర పార్టీలలో సర్దుకుపోలేనంత మాత్రాన మీ పార్టీలో చేరుతున్న నేతలు ఉత్తములు కాలేరు. ఉత్తములనే వారు ఏ పార్టీలో కొనసాగినా తమ సేవా భావాన్ని వీడరనే విషయం తెలుసుకోండి.

జిల్లాలో మరో సీనియర్ నేతతో గొడవవచ్చిందనో లేక ఆ పార్టీలో సరైన పదవిలేదనో చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేసి మీ పార్టీలో చేరుతున్న వారు మరి రేపు మీ పార్టీకి కూడా బెబ్బే చెప్పరని గ్యారంటీ ఉందా.

అందులోనూ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. అలాంటి సందర్భాల్లో అవినీతిపరులు, అవకతవకలు, నిధుల దుర్వినియోగం వంటి చర్యలకు పాల్పడిన వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించకుంటే మీపైన ప్రజల్లో ఉన్న విశ్వాసం తగ్గిపోగలదు. తస్మాత్ జాగ్రత్త.

Share this Story:

Follow Webdunia telugu