వార్త: టాటా కారు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆందోళనలను ఉధృతం చేసిన నేపథ్యంలో బంద్‌లు, రాస్తారోకోలు చట్ట వ్యతిరేకమని, తానూ దానిని వ్యతిరేకిస్తున్నానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య అనడం సీపీఎంలో కలకలం రేపింది.
చెవాకు: మరి మీ పార్టీ పుట్టుకొచ్చింది అందులోనుంచేగా. నాడు ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టకుంటే నేడు మీరు అధికారంలో ఉండేవారా? ఉద్యమాలను ఎదుర్కోలేకుంటే ప్రజా సమస్యలపై పోరాడే హక్కు భవిష్యత్తులో మీకు కూడా ఉండకపోవచ్చు. అందుకే అన్నారు పెద్దలు.
మీ వ్యాఖ్యలపై మీ పార్టీలోనే వ్యతిరేకత వచ్చిందంటే ప్రజా ఆందోళనలన్నది మీ అభిప్రాయం ఎంత తప్పో తెలుసుకోగలరు. పారిశ్రామికీకరణ అవసరమే...కానీ ప్రజాభిప్రాయం తీసుకుని ముందుకు సాగి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడేదా... బాగా ఆలోచించండి.
అణు ఒప్పందంలో అన్ని పార్టీల అభిప్రాయం మేరకు నడచుకోవాలని యూపీఏ సర్కారుకు చెప్పిన మీరు ఇలా ఏకపక్షంగా దానిపై నిర్ణయం తీసుకుని, ఇరుకున పడటంతో పాటు ఆందోళనలే సబబు కాదన్నట్టు మాట్లాడడం ఏమంత బాగోలేదు బుద్ధదేవ్ గారూ.