``ఏమిటే నీకసలు బుద్దుందా...నాకు కళ్లు సరిగా కనిపించవని మీ అమ్మతో చెపుతావా... మళ్లీ ఇలాంటి వెధవ వేషాలు వేసావంటే నీ వీపు చేరేస్తా`` అరిచాడు భర్త అప్పారావు.
``నేను మీ అత్తగార్ని బాబూ... అమ్మాయి పెరట్లో బట్టలు ఉతుకుతోంది వెళ్లి చూడు...``భయపడుతూ చెప్పింది అత్త గారు సుబ్బలక్ష్మి