Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..!

Advertiesment
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..!
, శనివారం, 27 సెప్టెంబరు 2008 (17:40 IST)
FileFILE
వార్త : యూఎన్‌పీఏలో భాగస్వాములుగా ఉన్న అస్సాం గణపరిషద్, జార్ఖండ్ వికాస్ మోర్చా, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, రాష్ట్రీయ లోక్‌దళ్‌లతో పొత్తు వ్యవహారం చివరి దశకు చేరినట్టు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశాల్లో నివేదించారు.

చెవాకు : నాకేం లాభం అనుకునే వారితో కూటమి ఏర్పాటు చేసుకుంటే ఇలాగే ఉంటుంది. గతంలో నేషనల్ ఫ్రంట్, యునైటడ్ ఫ్రంట్‌లు చూసిన వారికి ఈ మూడో ఫ్రంట్ ఏర్పాటుపై పెద్దగా ఆశలు లేవు.

కానీ ప్రస్తుతం యువతరానికి కూడా ఈ మూడో ఫ్రంట్ అంటే ఏమిటనే విషయాన్ని మీరు చూపగలిగారు. కాకుంటే ఈ దఫా లెఫ్ట్ పార్టీలు కూడా ఈ మూడో ఫ్రంట్‌పై కాస్త గట్టిగా ఆశలు పెట్టుకోవడమే విచిత్రం. తామే ముందుండి నడిపించనంత పని కూడా చేశారు.

చంద్రబాబు, కేసీఆర్‌లైతే ఏకంగా మాటల్లో మాయవతిని ప్రధాని కూడా చేసేశారు. ఆమె నిలకడలేనితనాన్ని చూసిన తర్వాత కూడా వారు ఇలా చేశారంటే ఆశ్చర్యమే. కేవలం కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేకతే ప్రాతిపదికగా అంటే ఇలాగే ఉంటుంది.

సరైన పార్టీలను ఎంపిక చేసుకుని, పరస్పర విశ్వాసం పెంపొందించుకుని, అవసరమైన చోట త్యాగాలకు సిద్ధపడితే మాత్రమే మూడో కూటమి విజయం సాధించగలదు. ఏదో ఎన్నికలు దగ్గర పడుతుంది కదాని వచ్చే వారినందరినీ చేర్చుకుని, ముందుకు వెళితే ఇలా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu