వార్త: తెలంగాణ ప్రాంతానికి చెందిన తనను అణగదొక్కేందుకై సమైక్య వాదులకు మీడియా కొమ్ము కాస్తోందని తల్లి తెలంగాణ పార్టీ అధినేత్రి విజయశాంతి విరుచుకు పడ్డారు.
చెవాకు: ఏదో ఎన్నికల సమయంలో మాత్రమే తెలంగాణాను గుర్తుకు తెచ్చుకునే మిమ్మల్ని మీడియా అణగదొక్కాలనుకోవడమేంటి. మీ బలం మీద మీకు నమ్మకముంటే కేసీఆర్ వద్దకు మీరే వెళ్లడమేంటి? తెలంగాణ వాదుల ఐక్యత మీ ఉద్ధేశ్యం అయితే ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నట్టు.
అసలు తెలంగాణ వాదులు కలిసి ఉంటేగా వారిని విడదీసేందుకు. ఇప్పటివరకు ఆయా నేతలు తమ తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఇటీవలి ఉప ఎన్నికల్లో దెబ్బ తిన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మీరు చెప్పకున్నా కేసీఆర్ పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారనే విషయం తెలిసిందేగా.
మీతో కలిసి పనిచేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని మీరు చెబుతున్న విషయం వాస్తవమైతే, అయితే మీరు చెప్పిన పార్టీతోనే పొత్తు పెట్టుకునేలా ఆయనను ఒప్పించగలరా. మీకు కావాలంటే ఓ ఎంపీ సీటు ఇచ్చేందుకు ఆయన రెడీ. అంతకు మించి పెత్తనం ఆశించడం మీకు కూడా తగింది కాదుగా.