Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ మంత్రం పనిచేస్తుందా?

Advertiesment
ఈ మంత్రం పనిచేస్తుందా?
, శనివారం, 27 సెప్టెంబరు 2008 (17:41 IST)
వార్త : చిరంజీవి పార్టీ ప్రభావం కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లో బీసీలు ఆయన వైపు మొగ్గు చూపవచ్చన్న వార్తల నేపథ్యంలో తమ పార్టీ తరపున అధికంగా వారికే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించామని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

చెవాకు : పోటీ పెరిగిన కారణంగా అయినా సేవాభావం కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారని భావిస్తే, ఇంకా సామాజిక సమీకరణలేనా. సేవాభావం కలిగిన అభ్యర్థులు ఎక్కడ ఉన్నా ప్రజలు ఖచ్చితంగా వారిని ఆదరిస్తారనే విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోరు.

మీరు బీసీలకు టికెట్లు ఇచ్చినంత మాత్రాన మీ పార్టీ అభ్యర్థులందరూ మంచి వారుగానే ఉంటారనుకుంటున్నారా? ఒక వేళ మీకు పోటీగా కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలు కూడా బీసీలకే టికెట్లు ఇస్తే మీ పరిస్థితి ఏమిటి?

అలా లేకున్నా జనాభాలో సగంగా ఉన్న మహిళలకు ప్రోత్సాహం ఇస్తున్నామనే పేరుతో కొత్తగా వచ్చిన ప్రజారాజ్యం పార్టీ మహిళలకే సీట్లు కేటాయిస్తే మీరేం చేయగలరు? బీసీ కార్డు ఉపయోగిస్తే మాత్రమే గెలుపు సాధ్యమనే విషయాన్ని పక్కనబెట్టి సేవాదృష్టితో (నిజంగా) ఆలోచించడమే మంచిదేమో.

Share this Story:

Follow Webdunia telugu