వార్తః నిజామాబాద్ జిల్లాలో మీకోసం యాత్ర చేపట్టిన సందర్భంగా పేదలకు లక్షతో ఇల్లు ఉచితంగా నిర్మించి ఇస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
ఇదేదో ఆ నాలుగైదేళ్లు కిందట చేసి ఉంటే ఎంత బావుండేది. నిర్మాణ సామగ్రి ఖర్చు కూడా తక్కువే కాబట్టి లక్ష రూపాయలకు వారికి మరింత విశాలమైన ఇల్లు దక్కేది. వారి ధన్యవాదాల పుణ్యాన అధికారమూ మీ చెంతనే ఉండేది. ఇటు అధికారమూ కోల్పోయి, అధిక ధరల సమయంలో లక్ష రూపాయలకు ఇల్లు కట్టిస్తానంటే అదెలాగుంటదోనని వారికి సందేహం రాకపోదు. ఆ ధరకు మీరు నిర్మించే ఇల్లు ఎంత సైజులో ఉంటుందనే విషయం కూడా చెప్పేస్తే వారు కాస్త ఆలోచించుకునేందుకైనా వీలుంటుంది.