వార్త : తన కింద పనిచేసే ఓ మహిళా కెప్టెన్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో సైనిక కోర్టు మార్షల్ ఓ మేజర్ జనరల్‌ను దోషిగా గుర్తించింది.
చెవాకు : సైన్యంలో ఉన్నత స్థాయికి చేరేందుకు పడిన శ్రమ మొత్తం క్షణిక ఉద్రేకానికి బూడిదైపోయిందిగా. స్త్రీ బలహీనతతో ఉన్నత స్థాయి నుంచి ఒక్కసారిగా అథమ స్థాయికి పడిపోయావు కదయ్యా.
అసలే సైన్యంలో, పోలీసు ఉద్యోగాల్లో చేరేందుకు మహిళలు ముందుకు రావడం కష్టంగా ఉంటే ఇలాంటి కీచక కృత్యాలు వారిని మరెంతగా భయపెడుతాయనే విషయాన్ని ఎందుకు ఆలోచించలేక పోయారు.
వీరిని కేవలం పదవి నుంచి తొలగిస్తే మాత్రమే మహిళా సమాజానికి న్యాయం జరిగినట్టు కాగలదా. మరో దఫా ఇలాంటి సంఘటన జరుగకుండా ఉండేలా చర్య తీసుకుంటే మాత్రమే మహిళల్లో ఈ ఉద్యోగాలపై విశ్వాసం కలిగించిన వారు కాగలరు.