Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అదీ మన ఘనతేనా

అదీ మన ఘనతేనా
వార్త: చదరపు కిలోమీటరకు 385 మంది లెక్కన ఐరోపా ఖండంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన దేశంగా ఇంగ్లాండ్ అవతరించగా, వలసల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని అక్కడి నిపుణులు చెబుతున్నారు.

చెవాకు: అక్కడికి వలసలు వెళుతున్న వారిలో అత్యధికులు ఆసియా వాసులేనని చెప్పడం ద్వారా మనవారే పెద్ద సంఖ్యలో ఉంటారని భావించవచ్చునేమో. అంటే మనవారు ఇటీవలి కాలంలో అమెరికాను వదలి బ్రిటన్‌పై కన్నేశారేమో.

జర్మనీకన్నా రెండింతలు, ఫ్రాన్స్ కన్నా మూడింతలు అధికంగా ఉందని చెప్పడం ద్వారా మన ఘనతను చెప్పకనే చెబుతోంది. వలసలు వెళ్లే ఆసియా వాసుల్లో భారతీయులే అధికంగా ఉంటారని వేరే చెప్పనక్కరలేదు.

చైనా, జపాన్, కొరియా, మలేషియాలతో పోల్చితే ఉన్నత చదువులు, ఉద్యోగాల నిమిత్తం అక్కడకు వెళ్లిన వారు మనవారు కాక మరెవ్వరుంటారు. మన వారి ఘనత మనకి తెలియదా. ఏంటి?

Share this Story:

Follow Webdunia telugu