Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అడుసు తొక్కనేల, కాళ్లు...

Advertiesment
హాస్యం చెవాకులు వార్త చెవాకు మరాఠీ భాష వ్యాఖ్య మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేన ప్రతిఘటన నేపథ్యం పాము రాజ్ థాక్రే ఉద్యమం
, మంగళవారం, 9 సెప్టెంబరు 2008 (17:30 IST)
FileFILE
వార్త: మరాఠీ భాషపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేన నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైన నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ క్షమాపణలు కోరారు.

చెవాకు: భాష గురించి నిన్నెవరు అడిగారమ్మా. పడుకోనున్న పామును రెచ్చగొట్టినా ఫరవాలేదు. పడుకున్నట్టు నటిస్తున్న పామును రెచ్చగొడితే మరీ పరిణామాలు ఇలాగే ఉంటాయి.

రాజకీయంలో పై స్థాయికి ఎదిగిపోయాం కదా అనుకుని ఇష్టానికి వ్యవహరిస్తే రాజ్ థాక్రే వంటి వారికి ఆయుధం అందించిన వారు కాగలరు. సినిమాలలో స్టార్ అయినా, ఎంత గొప్ప రాజకీయ నేత అయినా ప్రజాగ్రహం పెల్లుబుకితే దిగిరాక తప్పదు.

అసలే శివసేన నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలా తన మహారాష్ట్ర నిర్మాణ్ సేన్‌ను ముందుకు తీసుకెళ్లాలా అని రాజ్ థాక్రే ఆలోచిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇప్పటికే ఉత్తరాది వారిని వెళ్లగొట్టాలంటూ ప్రత్యేక ఉద్యమాన్ని ఆయన చేస్తుండగా, లేని వివాదాన్ని మీరెందుకు రేకెత్తించడం. ముంబయిలోనే ఉండాల్సిన వారు. కాస్త జాగ్రత్తగా మసలు కుంటే మంచిది.

Share this Story:

Follow Webdunia telugu