Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్కడైనా....దక్కుతుందంటారా?

Advertiesment
అక్కడైనా దక్కుతుందంటారా చెవాకులు వినోదం ప్రజారాజ్యం
వార్త: వచ్చే ఎన్నికల్లో చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీతో కలిసి పోటీ చేస్తామని, దీనిపై 7న ఆయనతో జరిపే చర్చల్లో తమ పార్టీ తరపున తాను, జయప్రద, జయా బచ్చన్‌లు పాల్గొంటామని తెలిపారు.

చెవాకు: మీ పార్టీకి సంబంధించినంతవరకైతే అదే బెస్ట్. ఎలాగూ కాంగ్రెస్ కూటమిలో ఒక్క సీటు దొరకదనే విషయం తెలిసిందే. ఇక టీడీపీ మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేదు. ఇప్పటికే బీఎస్‌పీతో కలిసి తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నందున ఆ పార్టీతో పాటు లెఫ్ట్ పార్టీలు కూడా మీ దగ్గరకు వచ్చే అవకాశం లేదు.

ఇక చిన్న రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించే మీతో కలసి వచ్చేందుకు తెరాస, ఎన్టీపీపీలు కూడా సిద్ధం కాకపోవచ్చు. ఇక లౌకిక ముసుగుతో ఉన్న మీరు బీజేపీతో జట్టుకట్టలేరు. ఇక మిగిలింది ప్రజా రాజ్యం ఒక్కటే. ఔను, అక్కడైనా మీకు ఒకట్రెండు స్థానాలు దక్కుతుందనే నమ్మకం మీకు ఉందా.

అయినా కేంద్రంలో కాంగ్రెస్‌తో, ఇక్కడ ప్రజారాజ్యంతో ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లవా. మరో ముఖ్య విషయం ప్రజారాజ్యం కూటమిలో మీకు ఒకట్రెండు సీట్లు దక్కినా అక్కడ మీ తరపున పోటీ చేసే సమర్థులెవరైనా ఉన్నారా? ప్రధాన కూటమి తరపున సీటు దక్కుతుందంటే పార్టీ ఫిరాయించేందుకు మన వాళ్లు ఎవరో సిద్ధంగానే ఉంటారనే నమ్మకం మీకు బలంగానే ఉన్నట్టుందే.

Share this Story:

Follow Webdunia telugu