మెున్న పనిమీద బయటకు వెళ్లాను..
అలా వెళ్తుంటే పక్కనే పిచ్చాసుపత్రి కనిపించింది..
ఆ బోర్డ్‌ను చూసుకుంటూ వెళ్తుంటే, నా చిన్ననాటి స్నేహితురాలు కనిపించింది..
అదేంటే నువ్విక్కడ అని అడిగాను..
నేను ఇక్కడే డాక్టర్‌గా పనిచేస్తున్నారా.. అని చెప్పింది..
నా చాంబర్‌లో కూర్చుని మాట్లాడుకుందాం అని తీసుకెళ్లింది.
కాసేపు కుశల ప్రశ్శలు అయ్యాక.. నేను తనని ఒక ప్రశ్న అడిగాను..
నువ్వు, వాళ్లు పిచ్చివాళ్లు కాదా.. అని ఎలా కనిపెడతావ్... అని అడిగాను..
అందుకు తను.. అదా వాళ్లకు బాత్ టబ్ నిండా నీళ్లు నింపి, వాళ్ల చేతికి స్పూన్, జగ్, బకెట్ ఇచ్చి టబ్‌ని కాలీ చేయమని చెప్తాం. వారు దేనితో కాలీ చేస్తే.. దానిని బట్టి వారికి పిచ్చి ఏ రేంజ్‌లో ఉందో నిర్ణయిస్తాం..
అంటే మామూలు మనుష్యులు బకెట్‌తో కాలీ చేస్తారు కదా అన్నాను నేను..
అందుకామె కాదు. మామూలు వాళ్లు బాత్ డబ్ కున్న వాల్ తీసి కాలీ చేస్తారు... నువ్వెల్లి బెడ్ నంబర్ 25పై పడుకో నిన్ను టెస్ట్ చెయ్యాలి అంది..
ఓరినీ ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాను.. మీరు కూడా బకెట్ అనుకున్నారు కదా..
మీరు వచ్చి బడె నంబర్ 26 తీస్కోండి.. నాక్కూడా కొంచెం తోడుగా, ధైర్యంగా ఉన్నట్టు ఉంటుంది..