Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"వానాకాలం" ఉగాది

Advertiesment
ఉగాది తెలుగు లోగిళ్లు పచ్చడి అమెరికా సెల్ ఫోన్లు
మరో నాలుగు రోజుల్లో తెలుగు సంవత్సరాది ఉగాది. ఉగాదికి కవి సమ్మేళనాలు... అవార్డుల ప్రదానోత్సవాలు జరగటం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. ఇదంతా ఒక ఎత్తైతే ఆ రోజున ఉగాది పచ్చడిని తయారు చేసి దానిని కుటుంబ సమేతంగా రుచి చూడటం మరో ఎత్తు. అచ్చమైన తెలుగు లోగిళ్లలో ఈ ఉగాది సంపూర్ణతను సంతరించుకుంటుంది. ఐటీ కల్చర్ వీరవిహారం చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఉగాది పచ్చడి ఎలా చేయాలో అప్పటికప్పుడు చెప్పినవారిని అమెరికా యాత్రకు పంపిస్తానని ప్రకటించింది.

అసలు ఉగాది అంటే ఏమిటీ అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ మొదలయ్యాయి. ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లు గణగణలాడాయి. తమ ఇళ్లకు ఫోనులు చేసి ఉగాదిపై ప్రశ్నాస్త్రాలను సంధించి అరకొర సమాధానాలను రాబట్టినవారిలో కొందరు వేపపూతతో చేస్తారని అంటే... మరొకరు బెల్లంతో చేస్తారని అన్నారు. అసలు ఉగాది పచ్చడిని ఎలా తయారు చేస్తారు.... అందులో ఎన్ని రుచులు మిళతమై ఉంటాయో చెప్పలేని వింత పరిస్థితి తలెత్తింది. అందరూ 'సాఫ్ట్ 'వేర్లే కనుక తమ ల్యాప్‌ట్యాప్‌లకు పనిచెప్పారు.

మూకుమ్మడిగా కూర్చుకుని ఓ ప్రముఖ సెర్చ్ ఇంజన్‌లో ఉగాదిని శోధించారు. జవాబుగా... ఉగాది తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే షడ్రుచుల సమ్మేళనం. ఏడాది పొడవునా ఎదురయ్యే కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడికోసం అరటి పళ్ళు, మామిడి కాయలు, చెరకు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.

ఇదండీ వర్తమానం.... మరి భవిష్యత్... ఉగాది వానాకాలంలో వస్తుందా... శీతాకాలంలో వస్తుందా.... వేసవి కాలంలో వస్తుందా.... శోధించు...

Share this Story:

Follow Webdunia telugu