వార్తః తెలంగాణాలో జరిగిన ఉప ఎన్నికలో తెరాస కేవలం ఏడు శాసనసభ, రెండు లోక్‌సభ స్థానాలను మాత్రమే దక్కించుకుంది.
చెవాకుః ప్రత్యర్థులు పదే పదే సెంటిమెంట్‌పై రెఫరెండం కాదని చెప్పినా మీరు మాత్రం అంగీకరించలేదు. ఈ ఎన్నికల్లో తెలంగాణా మాత్రమే కాక పలు అంశాలు ప్రజలను ప్రభావితం చేయగలవని వారు చెప్పినా మీరు మాత్రమే ఒప్పుకోలేదు.
తెలంగాణా దెబ్బ సమైక్య వాదులకు రుచి చూపాలన్నారు. కానీ ప్రజలు మీ మాటలు పట్టించుకోలేక పోవడంలో ఆంతర్యమేమిటో బోధ పడటం లేదు. ఇపుడు సంభవించిన రెఫరెండం మీపైనా? తెలంగాణా పైనా? మీరే చెప్పాలి.