వార్త: ఢిల్లీతో జరిగే ఇరానీ ట్రోఫీ మ్యాచ్‌లో పాల్గొనే రెస్టాఫ్ ఇండియా జట్టులో మాజీ కెప్టెన్ గంగూలీతో పాటు యువరాజ్ సింగ్‌కు కూడా చోటు దక్కలేదు.
చెవాకు: హమ్మయ్య...మనోడికి మంచి ఛాన్స్ దొరికింది. ఇక బాలీవుడ్ తారలతో పార్టీలంటే పార్టీలే. ఇష్టమొచ్చినట్టు గడిపేయొచ్చు. మ్యాచ్‌పైన చిన్నతనంలో పెట్టిన శ్రద్ధకు తగినట్టే మంచి పేరు వచ్చేసింది.
వెంటబడి తిరిగేందుకు బాలీవుడ్ తారలు కూడా పోటీపడుతున్నారు. ఇంకేం కావాలి. ఎంతకాలమని ఈ క్రికెట్‌తో వేగడం. అయినా సరే కానీ క్రికెట్‌లో నీ అడ్రస్ గల్లంతైతే వారందరూ ఎంతకాలం నీ మొహం చూస్తారనుకుంటున్నావు.
ఏంటోనయ్యో నాకైతే అనుమానంగానే ఉంది. సాయంత్రం వేళల్లో పార్టీలకు వెళ్లినా మిగిలిన సమయాల్లోనైనా కాస్త క్రికెట్‌పై దృష్టి పెట్టు. లేకుంటే జట్టులో శాశ్వత స్థానం కోల్పోవడమే కాక ఆ తారల మనసుల్లో నుంచి కూడా బయటకు వెళ్లి పోవాల్సి రావచ్చు.