Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంతకాలం ఏం చేస్తున్నట్టు

Advertiesment
ఇంతకాలం ఏం చేస్తున్నట్టు
, సోమవారం, 22 సెప్టెంబరు 2008 (18:59 IST)
FileFILE
వార్త : నారాయణ కళాశాల గోడ కూలి ఓ విద్యార్థి మృతి చెందిన నేపథ్యంలో అనుమతి లేని కళాశాలలపై విచారణ జరిపి, పది రోజుల్లో చర్యలు తీసుకుంటామని సాంకేతిక విద్యా శాఖ మంత్రి చెంగారెడ్డి ప్రకటించారు.

చెవాకు : ప్రజల కోసం అన్నీ చేస్తున్నామని చెప్పే ప్రభుత్వం ఎంత అలసత్వంతో వ్యవహరిస్తోందనడానికి ఈ ఒక్క నిదర్శనం చాలదా. అసలు అనుమతి కళాశాలలు ఇంతకాలం తరగతులు ఎలా ధైర్యంగా తరగతులను నిర్వహించగలిగాయి.

ఈ విషయంలో మీ ప్రభుత్వంలోని అధికారుల ప్రమేయం లేదా. ఇంతకాలం జరపని సమీక్షలు ఇపుడే గుర్తుకు వచ్చాయా. ఏదైనా సంఘటన జరిగితే తప్ప మేల్కోలేరా.

అవినీతి కారణంగానే ఈ తరహా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఒప్పుకోలరా మంత్రి గారూ. ఆ అవినీతిలో ఎవరెవరికి వాటా ఉందనే విషయం అడగలేదు కానీ అవినీతికి పాల్పడేముందు అవి మరొకరి ప్రాణంతో చెలగాటమాడకుండా చూసుకోవాలిగా.

Share this Story:

Follow Webdunia telugu