వార్త : ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు, మద్యం పంపిణీ వంటి వాటిలో తమ పార్టీ పాల్గొనదని ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రా స్పష్టం చేశారు.
చెవాకు : ఈ నిర్ణయం కాస్త ఇబ్బందికరమే. మీ పార్టీ నాయకత్వంపై ఎంతో ఆశలు పెట్టుకుని మీ పార్టీలో చేరుతున్న వారు నీరుగారి పోగలరు. రాజకీయాల్లో గెలుపుకోసం ప్రయోగించక తప్పదు.
అందులోనూ చిరంజీవి రంగ ప్రవేశం చేసిన తర్వాత అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష టీడీపీలు తీవ్రస్థాయిలో సామ,దాన, దండోపాయాలకు సిద్ధమవుతుంటే, అస్త్ర సన్యాసం చేసి, పోరాడతామంటే కుదరకపోవచ్చు.
అన్ని ఆకర్షణలు ఎన్నికల్లో పనిచేసినా, చివరి రోజు నోటు, మద్యం పంపిణీ పోలింగ్‌పై తీవ్ర ప్రభావం చూడగలదనే విషయాన్ని గ్రహిస్తే మంచిది. ఈ విషయాన్ని ఎవరూ బహిరంగంగా చెప్పి చేయరు కాబట్టి మీరూ ఆ విషయాన్ని ప్రస్తావించకుండా ఉంటేనే మంచిది. ఎలాగూ మీ పార్టీ అభ్యర్థులే గెలుపుకోసం దానిపై ఏం చేయాలో చూసుకుంటారు.