వార్త: తమ పార్టీ రాష్ట్రంలో సొంతబలంతోనే 16నుంచి 18 స్థానాల్లో గెలవగలదని, మరో 80 స్థానాల్లో వివిధ రాజకీయ పార్టీల మధ్య గెలుపోటములను ప్రభావితం చేయగలదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు.
చెవాకు: ఆందోళనలు చేపట్టగలిగే స్థాయిలో ప్రతి నియోజకవర్గంలోనూ మీకు అంతో, ఇంతో మద్దతు ఉందని విన్నాం కానీ, సొంతంగానే గెలుస్తారని మాకూ తెలియదే. అంత బలం ఉంటే సొంతంగా పోటీచేయొచ్చుగా.
మీరు చెబుతున్నట్టు మిమ్మల్ని నమ్మతున్న ప్రజలు కూడా ఓటేసే సమయానికి మారిపోతున్నారంటే ఇక మీరు ఎలా గెలిచేంది. మిమ్మల్ని ఇప్పటికీ అన్ని పార్టీలు కరివేపాకులా వాడుకుంటున్నట్టు తెలుస్తోంది.
గత అనుభవాలతో మీకూ ఇది తెలిసినా మీరు కూడా అలా ఉండటానికే ఇష్టపడుతున్నట్టు ఉంది అసలు మీరు మీ కాళ్లపై నిలబడే ప్రయత్నం చేశారా అన్నదే అసలు ప్రశ్న. మీరు ఈ ప్రయత్నం చేయనందునే మీ కార్యకర్తలకు ఎరవేసేలా మీ తరహా ఆశయాలతోనే కొత్త పార్టీలు కూడా పుట్టుకొస్తున్నాయన్నది గమనిస్తే సరి.