Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంత మాత్రానికేనా?

అంత మాత్రానికేనా?
వార్త: యూపీ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 15 సీట్లకు మించి ఇవ్వబోమని సమాజ్‌వాదీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

చెవాకు: విశ్వాస పరీక్షలో మీ ప్రభుత్వాన్ని కాపాడారుగా. ఆ మాత్రం సర్దుకుపోకుంటే ఎలా? మీకేమో ఒంటరిగానే పది స్థానాల వరకు గెలవగలమనే విశ్వాసముండవచ్చు. సమాజ్‌వాదీ పార్టీ కూడా చాలావరకు బలహీనపడిందని మీరు భావించవచ్చు.

ఏ మాత్రం పట్టు విడుపులేని ములాయం సింగ్ బలహీనుడైనందునేగా మీ చెంతకు వచ్చారు? అయినా మాత్రం మీరు ఒంటరిగా సాధించేదేమీ గొప్పగా ఉండదనే విషయం తెలిసిందే.

ఏదో సర్దుకుపోతే రేపు ఒకవేళ మీకు మళ్లీ ప్రభుత్వం ఏర్పాటుకు సంఖ్యాబలం అవసరమైతే ఉపయోగపడగలదు. ములాయంకూ ప్రధాని పదవిపై కన్ను ఉందనే అనుమానాన్ని మీరు కాస్త పక్కనబెట్టండి.

Share this Story:

Follow Webdunia telugu