హరిలో రంగ హరీ.. "నువ్వుల అరిసెలు" తిందాం రండి..!!
కావలసిన పదార్థాలు :బియ్యం నానబెట్టి తయారుచేసిన పిండి.. అరకేజీబెల్లం... తీపి కావాల్సినంతనువ్వులు.. సరిపడానెయ్యి... అరకేజీతయారీ విధానం :ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని దాంట్లో తగినంత బెల్లంవేసి బాగా సన్నటి మంటపై ముదురుపాకం పట్టుకోవాలి. ప్లేటులో నీల్లు తీసుకుని అందులో కొద్దిగా పాకం వేస్తే, అది దగ్గరగా గట్టిపడి శబ్దం వచ్చినట్లయితే పాకం సిద్ధమైందని అర్థం చేసుకోవాలి.అలా వచ్చిన పాకంలో కొద్దిగా నెయ్యి, వేయించి శుభ్రంచేసి పెట్టుకున్న నువ్వులు, సరిపడా బియ్యంపిండి వేసి కలపాలి. ఆ మిశ్రమం ఉండ చేసేందుకు వీలుగా వచ్చేంతదాకా బాగా కలపాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి.వాటిని పలుచగా అరిసెల్లాగా వత్తి బాణలిలో కాగుతున్న నెయ్యిలో వేసి ఎర్రగా వేయించి తీసేయాలి. వేయించిన వాటిని చిల్లులున్న గరిటెతో బాగా వత్తినట్లయితే నెయ్యి అంతా బయటికి వచ్చేస్తుంది. అలా మొత్తం ఉండలను ఒత్తుకుని నేతిలో వేయించి తీసేస్తే ఘుమఘుమలాడే నువ్వుల అరిసెలు సిద్ధమైనట్లే..!