సంక్రాంతి నాడు విష్ణుసహస్రనామ పఠనం విశేష ఫలితాలనిస్తుందట!
FILE
సంక్రాంతి నాడు విష్ణు సహస్ర నామ పఠనం విశేష ఫలితాలను ఇస్తుందని పురోహితులు చెబుతున్నారు. ఈ రోజు సూర్య భగవానుడు మకరరాశిలోకి ప్రవేశించే పుణ్య ఘడియ, ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం. ఈ రోజున స్నాన, దాన, జప, వ్రతాదులు విశేషఫలితాలనిస్తాయి.
నువ్వు, బెల్లం, గుమ్మడికాయలు వంటి వాటిని దానం చేయడంతో పాటు పితృదేవతలకు తర్పణాలను వదిలితే మంచిది. ఈ రోజున దానాలకు విశేష ప్రాధాన్యం ఉంది. ఆ దాన మహిమను తెలిపే కథేంటో తెలుసా?
ద్రోణాచార్యుని భార్య కృపి. ఒక రోజు ద్రోణాచార్యుడు బయటకు వెళ్ళగా, ఆశ్రమంలో కృప్తి ఒక్కర్తే కూర్చుని వుందియ ఆ సమయంలో సమిధల కోసం వెదుక్కుంటూ వచ్చిన దుర్వాస మహాముని ద్రోణుని ఆశ్రమానికి వచ్చాడు. ఆ మునిని తమ ఆశ్రమంలోకి స్వాగతించిన కృపి, తమ పేదరికాన్ని ఒప్పుకుని , తమకు ఈ ప్రపంచంలో ఒక ముసలి ఆవు తప్ప ఏమీ లేదని, పిల్లలు కూడా కలుగలేదని వేడుకుంది.
ఆమె మాటలు విని దయార్ద్ర హృదయుడైన దుర్వాసుడు సంక్రాంతినాడు, గంగానదిలో స్నానం చేసి, ఓ బ్రహ్మణుని పెరుగును దానం చేస్తే ఫలితం ఉంటుందని, ఆ రోజే సంక్రాంతి కనుక వెంటనే ఆవ్రతాన్ని చేయమని సలహా ఇచ్చాడు. ఆయన మాటల ప్రకారం కృపి దగ్గర్లో ఉన్న నదిలో స్నానం చేసి, దుర్వాసునికే పెరుగును దానం చేసింది. ఫలితంగా ఆమెకు ఓ చక్కని కొడుకు కలిగాడు. అతడే అశ్వత్థామ. అశ్వత్థామ పుట్టినప్పటి నుంచి కృపికి ఎటువంటి కష్టాలు ఎదురుకాలేదు.