Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డూ.. డూ.. బసవన్న.. రైతుల నేస్తం నీవన్నా..!

Advertiesment
ఇతరాలు వెబ్దునియా స్పెషల్ 2009 మకర సంక్రాంతి డూ డూ బసవన్న రైతులు నేస్తం గోమాత ధాన్యం పొంగళ్ళు  గాలిపటాలు
రైతన్నలకు ప్రీతిపాత్రమైన కనుమ పండుగ రోజున తమ బిడ్డలకు ఎలాంటి లోటు లేకుండా... పాడిని అందించే "గోమాత"ను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. వ్యవసాయ పనులలో రైతన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ చివరకు ధాన్యపు రాశులను ఇంటికి చేర్చేంత వరకు తోడ్పడే బసవన్నకు పూజలు జరిపి పసుపుల పండుగ చేస్తారు.

సంక్రాంతికి మరునాడు వచ్చే కనుమ పండుగ రోజున రైతులు ఉదయాన్నే లేచి పశువుల కొట్టాలను శుభ్రం చేసి పశువులను చక్కగా అలంకరించి పొంగళ్ళు వండుతారు. పొంగలిని దేవతలకు నైవేద్యంగా పెట్టిన తర్వాత... తమ పొంట పొలాలకు వెళ్లి ఆ పొంగలి మెతుకులను చల్లుతారు. దీనినే పొలి చల్లటం అని కూడా అంటారు.

ఇలా చేయడం వల్ల పంటలు బాగా పండి చేతికొస్తాయన్నది రైతన్నల విశ్వాసం. ఈ పొలి పొంగలిని పొలంలో చల్లేటప్పుడు పసుపు, కుంకుమలతో కలిపి చల్లుతారు.
webdunia
ఈ రోజున పెద్దలు, పిల్లలు పోటీ పడుతూ... వారి వారికి అనుకూలమైన సైజులలో గాలిపటాలను కట్టి... ఆకాశంలో ఎగురవేస్తారు. మరికొందరు.. పార్వతీపరమేశ్వరుల బొమ్మలను చిత్రీకరించి గాలిపటంగా ఆకాశంలోకి ఎగురవేస్తారు. ఇరుగు-పొరుగు గ్రామ వాసులంతా ఒక్కచోట చేరి మేళతాళాలతో అత్యంత వైభవంగా "ప్రభలతీర్థం" (గాలిపటాలను ఎగురవేయడం) నిర్వహిస్తారు. గ్రామసీమలో రైతన్నలంతా ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగల్లో కనుమ పండుగ కూడా ఒకటి.


కొన్ని ప్రాంతాలలో కోడి పందేలు వనభోజనాలను కూడా ఈరోజే నిర్వహిస్తుంటారు. అంతే కాదు, కనుమ నాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగా, ఆ రోజున గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ. కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్రరాష్ట్రాన ఆనవాయితీగా వస్తోంది. మాంసాహారులు కాని వారు, కనుమ పండుగ రోజున గారెలను (మినుములో మాంసకృతులు హెచ్చుగా ఉంటాయి) కనుక దానిని శాకాహార మాంసంగా పరిగణించి కాబోలు సంతృప్తి పడతారు. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చెయ్యకపోవడం కూడా సాంప్రదాయం...

Share this Story:

Follow Webdunia telugu