Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెక్స్ అనుభవం కోసం పరుగులెత్తే టీనేజ్ వయస్సు... అదుపు అవసరం..!!

సెక్స్ అనుభవం కోసం పరుగులెత్తే టీనేజ్ వయస్సు... అదుపు అవసరం..!!
, మంగళవారం, 25 సెప్టెంబరు 2012 (22:13 IST)
WD
టీనేజ్ వయసుకు వచ్చిన యువతీయువకుల్లో కోరికలు పురివిప్పి బుసలు కొడుతుంటాయి. యవ్వనం తెచ్చిన కొత్త అందాలను ఆస్వాదించాలని పరుగులు పెడుతుంటాయి. ఈ దశలో అమ్మాయి - అబ్బాయిల మధ్య స్నేహం... స్నేహంగా కాక ప్రేమకు... ఆ తర్వాత శారీరక సంబంధాలకు సైతం దారి తీసే ప్రమాదం ఉన్నది.

ఐతే కొందరు యువతీయువకులు పెద్దల పెంపకంతో వచ్చిన క్రమశిక్షణ మనసును అదుపులో ఉంచుతుంది. కోరికలకు పగ్గాలు వేసి గట్టిగా బిగపడుతుంది. కొంతమంది అబ్బాయిలు.. అమ్మాయిలు మరీ సాన్నిహిత్యం పెరిగి సెక్స్ సుఖాన్ని అనుభవించాలని మనసు ఉవ్విళ్లూరుతోంది.

ఐతే ఈ వయసులో అమ్మాయిలు - అబ్బాయిల మధ్య ఉన్నది ప్రేమ కంటే ఆకర్షణే ఎక్కువ. ఒకవేళ కోరికలు అవధులు దాటి లైంగిక ఆనందాన్ని చవిచూసిన తదుపరి ఆకర్షణ కాస్తా ఆవిరయిపోతుంది. పైగా లేనిపోని కొత్త సమస్యలు వచ్చిపడతాయి. అమ్మాయికి గర్భం వచ్చే అవకాశం లేకపోలేదు. ఇవన్నీ అటు అమ్మాయి... ఇటు అబ్బాయి తల్లిదండ్రులనే కాక వారివారి చదువులకు ఆటంకాలుగా మారుతాయి. కనుక అర్థం చేసుకునే వయసు... ఆర్థికంగా నిలదొక్కుకోగల ఉద్యోగం సాధించినప్పుడే ప్రేమను పెళ్లితో కలిపి లైంగిక సుఖాలకు బాటలు వేసుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu