Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శృంగారానికి తొలిమెట్టు ముద్దు... మగ ముద్దు, ఆడ ముద్దు ఏంటి తేడా...?!!

శృంగారానికి తొలిమెట్టు ముద్దు... మగ ముద్దు, ఆడ ముద్దు ఏంటి తేడా...?!!
, సోమవారం, 4 మార్చి 2013 (17:59 IST)
WD
వయసు ఏదైనా మనసులోని ప్రేమను, ఇష్టాన్ని తెలియజెప్పే సాధనం ముద్దు. పసి పిల్లవాడి నుండి పలురకాల ముద్దులను ప్రతిఒక్కరు రుచిచూసే ఉంటారు. కాని ఆ ముద్దులన్నింటికీ భిన్నమైన ముద్దు వయసులో వుండగా పొందే ముద్దులు.

స్త్రీ, పురుషులు తమ ప్రేమను తొలిగా తెలియజెప్పుకునేది ముద్దుల ద్వారానే. మధురమైన లైంగిక జీవితానికి సంకేతంగా ముద్దు నిలుస్తుంది. పురుషులకు, స్త్రీలకు ఇద్దరికీ ముద్దులు అవసరమే. ఇందులో ఎవరు ఎవరికిస్తారు, ఎవరు అందుకుంటారు అనే ప్రశ్న లేదు. సెక్స్‌లో ఆనందాలను ఎలా పంచుకుంటారో అలాగే ముద్దులలోని మాధుర్యాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు.

ముద్దులవల్ల పొందేది ఒకేలా అనిపించినా, ముద్దు పెట్టుకోవడం ఒకేలాంటిదే అనుకున్నా ముద్దులలో మగముద్దులు, ఆడముద్దులు భిన్నమైనవి. మగ, ఆడముద్దులు భిన్నమైన సందేశాలను అందిస్తాయి. మగవాడి దృష్టిలో ముద్దు సెక్స్‌కి తొలి అడుగు. కాని ఆడవారి దృష్టిలో ముద్దులనేవి మగవాడి ప్రేమను కొలిచే సాధనం. తనమీద ఎంతవరకూ అతనికి ప్రేమ ఉందనే దాన్ని ముద్దును బట్టి అంచనా వేసుకుంటారు.

ఇరువురి పెదవుల కలయిక ముద్దుగా కనిపించినా ఆ కలయిక వెనుకున్న రసాయనం భిన్నమైనది. ముద్దు పెట్టుకునేందుకు ముఖం మీదున్న కండరాలలో ఓకేఒక్క కండరమే పనిచేస్తుంది. ఐతే ముద్దు సమయంలో ఆ కండరం ఒకటి ఎంత తీవ్రంగా పనిచేస్తుందంటే ఒక నిమిషం ముద్దుల్లో 26 క్యాలరీల శక్తి వినియోగమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu