Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాస్తవంగా ప్రేమ గుడ్డి వాళ్లను చేస్తుందా...?

వాస్తవంగా ప్రేమ గుడ్డి వాళ్లను చేస్తుందా...?

Hanumantha Reddy

WD
వయసులో ఉన్న యువతీ యువకులు ప్రేమలో పడటం సహజంగానే జరుగుతుంటుంది. అలా ప్రేమలో పడ్డ యువతీ, యువకులు ఎంత దూరమైనా వెళ్లడం. ఆ ప్రయాణంలో ఎంతటి త్యాగాలకైనా వెనుకాడకపోవడం. అలాగే అడ్డొస్తే మాత్రం చంపడానికి, చావడానికి కూడా వెనుకాడకపోవడం. ఎన్నో ఏళ్లుగా పెంచిన కన్న ప్రేమను సైతం కాదని తమ గుండెల్లో దాచుకున్న ప్రేమ కోసం వెళ్లిపోతుండటం తరుచుగా మనం వింటున్నవే.. కళ్లారా కొన్ని చూస్తున్నవే.

ఇక విషయంలోకి వస్తే.. దేవదాసు-పార్వతి, సలీం-అనార్కలీ వంటి ప్రేమికులు చరిత్రలోని వ్యక్తులో లేక కల్పించిన కథలోని పాత్రలో తెలియదు కాని... ఆధునిక వాస్తవిక ప్రేమికులు మాత్రం కళ్లున్న గుడ్డివాళ్లవుతున్నారని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఇందుకు తమ దగ్గర శాస్త్రీయమైన ఆధారాలున్నాయని.. ప్రేమ గుడ్డివాళ్లను చేస్తుందని వారు నొక్కి వక్కాణిస్తున్నారు.

అమెరికాలోని ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలోని టల్లాహస్సీ నేతృత్వంలో ప్రేమకు సంబంధించిన అంశంలో జరిపిన పరిశోధనల ఆధారంగా వెల్లడైన నగ్న సత్యమిది. ఎందరో కవులు, రచయితలు, పండితులు తమ అనుభవాలను రంగరిస్తూ ప్రేమ గుడ్డిదని ఇప్పటికే చెప్పి ఉన్నప్పటికీ... శాస్త్రీయపరంగా రుజువైంది మాత్రం ఈ పరిశోధనల ద్వారానే అని చెప్పవచ్చు. ఈ పరిశోధనల ద్వారా కనుగొన్న కొన్ని ఆసక్తికర అంశాలు మీ కోసం...

చూడగానే అందరి దృష్టిని ఇట్టే ఆకట్టుకునే సుమారు 113మంది విద్యార్ధులపై శాస్త్రవేత్తలు సుదీర్ఘ పరిశోధనలను చేశారు. వీళ్లందరూ తాము అనుకున్న భాగస్వాములతో కలిసి ప్రేమలో ఎలా ముందుకెళుతున్నారు. ప్రేమలో పడిన వీరి ఆలోచనా సరళి ఎలా మారుతోంది. అలాగే సునిశిత విశ్లేషణల్లో వీరి ప్రదర్శిన తీరు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. వీరిలో 57మంది విద్యార్ధులు తాము ప్రేమించిన వారి పట్ల పూర్తి భావావేశాలను (ప్రేమమైకంలో) కలిగి ఉండగా... మిగిలిన 56 మంది విద్యార్ధులు సంతోషపు సరిహద్దులను తాకుతూ తెలియని ఆనందంతో పరవశించిపోతున్నట్లు గుర్తించారు.

సాధారణ మేని మెరుపు కలిగిన మహిళలు, పురుషులు అలాగే రతీ, మన్మధులను తలపించే రీతిలో ఉండే చక్కటి మేనిగల స్త్రీ, పురుషులకు సంబంధించి వివిధ రూపాలతో కూడిన 60ఫోటోలను 500మైక్రో సెకెండ్‌ ఫ్లాష్‌లుగా విద్యార్ధులకు ప్రదర్శించడం జరిగింది.

వేగంగా ఫ్లాష్‌లు ఇలా మెరిసి అలా మాయమయిపోతుండటం వల్ల స్క్రీన్‌పై చతురస్రాకారం లేక వలయాకారం మాత్రమే దృష్టికి వస్తోంది. అక్కడ ఒక రూపాన్ని త్వరితంగా గుర్తించేందుకు తాము క్షణకాలం పాటు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు విద్యార్ధులు చెప్పారు. అదే సమయంలో ఆ తపన వారిని వాస్తవిక పరిస్థితి నుంచి ఉపచేతన (సబ్‌కాన్షియస్) స్థితికి తీసుకువెళ్లడాన్ని శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా గుర్తించారు.

ఈ అధ్యయనంలో ఇంకా సంతోషం గురించి లెక్కలేనన్ని వ్యాసాలు రాసిన విద్యార్ధులతో పోల్చి చూస్తే... మదినిండా ప్రేమ భావం కలిగి ఉన్న విద్యార్ధులు.. పరలింగానికి సంబంధించిన ఆకర్షణీయమైన ముఖాన్ని వీక్షించిన తర్వాత ఆ ఫ్లాష్ రూపాలను అతి త్వరగా గుర్తించగలుగుతున్నారు. ఇందులో అత్యంత ఆకర్షణీయమైన పరలింగ వ్యక్తులను (తాము ప్రేమించిన వారు అక్కడే ఉన్నప్పటికీ) ముందుగా గుర్తించి ఆ సౌందర్యాన్ని నెమరువేసుకుంటున్నారు. అయితే ఈ ఆలోచన క్షణకాలం పాటు మాత్రమే జరుగుతోందని.. అనంతరం వారు తాము ప్రేమించిన వ్యక్తులపైనే అత్యంత శ్రద్ధతో వ్యవహరిస్తున్నట్లు వెల్లడైంది.

ఇక్కడ ఆకర్షణ, వికర్షణలకు సంబంధించిన అంశం కూడా అధ్యయనంలో ఒక భాగంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. అంటే ఒక ఫ్లాష్ మెరిసినప్పుడు వచ్చే ముఖానికి సంబంధించిన రూపాన్ని చూసినప్పుడు ఏర్పడేది ఆకర్షణ అయితే ఫ్లాష్ ఆగినప్పుడు ఆ రూపం మస్తిష్కం నుండి అలాగే వెళ్లిపోతోంది. దానర్థం వికర్షణగా చెప్పవచ్చు.

ఇంకా విశ్లేషించి చెప్పాలంటే... తాము ప్రేమించిన వారు ఎదురుగా ఉన్న సమయంలో వేరే ఒక సౌందర్య రూపం తమ కంట పడినప్పుడు ఆలోచనా ధోరణి కాస్త మారుతుంది. అది కూడా క్షణకాలం మాత్రమే.. ఇతరులకు.. అంటే స్త్రీ లేక పురుషులకు ఎంత సౌందర్యమున్నా వారి ఆలోచన అంతా ప్రేమించిన వారిపైనే సంపూర్ణ దృష్టి ఉంటుందన్నదన్నమాట. అంటే ప్రేమమైకం ఎంతటి అపురూప బాహ్య సౌందర్యాన్నైనా లెక్కచేయదు, కోరుకోదు అన్న విషయం రుజువైంది.

Share this Story:

Follow Webdunia telugu